Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల విజయంలో సర్వేలన్నీ నిజమయ్యాయి. అందరు అనుకుంటున్నట్లుగానే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ భారీ గెలుపు సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓట్ల లెక్కింపు మొదటి దశ నుంచే ముందంజలో సాగి, చివరకు 25 వేలకుపైగా మెజార్టీతో గెలిచారు. BRS అభ్యర్థి మాగంటి సునీత ఏ దశలోనూ ఆధిక్యం సాధించలేకపోయారు.
24
ప్రతి రౌండ్‌లో కాంగ్రెస్‌దే పైచేయి
ఓట్ల లెక్కింపు మొదలైన క్షణం నుంచే నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యంతో ముందున్నారు. రౌండ్ తర్వాత రౌండ్ ఆ ఆధిక్యం పెరుగుతూనే వచ్చింది. ఒక్క దశలోనూ బీఆర్ఎస్‌కు అవకాశమే లేకుండా పోయింది. ఈ ఫలితం కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపింది.
34
బీజేపీకి గట్టి దెబ్బ
BRSతోపాటు భాజపాకు కూడా ఈ ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే రెండు పార్టీలకు ఓట్ల సంఖ్య తగ్గిపోయింది. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి దీపక్‌కు డిపాజిట్ కోల్పోవడం గమనార్హం.
సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న వ్యూహాలు ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచార నిర్వహణ వరకూ ఆయన స్వయంగా పర్యవేక్షించారు. మైనారిటీల మద్దతు మరింత పెంచేందుకు పోలింగ్‌కు ముందు అజారుద్దీన్‌కు మంత్రి బాధ్యతలు అప్పగించారు. ప్రతి డివిజన్‌కు ఒకో మంత్రిని నియమించి సమన్వయం పెంచే చర్యలు తీసుకున్నారు.