Jubilee Hills లో కాంగ్రెస్ గెలవడానికి టాప్ 10 రీజన్స్ ఇవే...

Published : Nov 14, 2025, 02:05 PM ISTUpdated : Nov 14, 2025, 02:18 PM IST

Jubilee Hills By Election 2025 : జూబ్లీహిల్స్ లో కాంగ్రెెస్ గెలుపుకు కారణాలేంటి? నవీన్ యాదవ్ ను గెలుపులో కీలకంగా మారిన టాప్ 10 అంశాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
111
జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ విజయకేతనం

Jubilee Hills By Election Results 2025 : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారత రాష్ట్ర సమితి సానుభూతి కార్డ్ పనిచేయలేదు... ఆ పార్టీ సిట్టింగ్ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ హవా సాగింది… కానీ హైదరాబాద్ (జిహెచ్ఎంసి) పరిధిలో ఖాతా తెరవలేకపోయింది. కానీ అధికారంలోకి వచ్చాక వరుసగా రెండో ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాదిరిగానే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య సునీతపై నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు.. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార కాంగ్రెస్ కు ప్రతిపక్ష బిఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇస్తుందని అందరూ భావించారు. ఆ తరహాలోనే కాంగ్రెస్, బిఆర్ఎస్ లు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి... పోల్ మేనేజ్మెంట్ చేశాయి. గత సాధారణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అర్బన్ ఓటర్ బిఆర్ఎస్ కు సపోర్ట్ గా నిలుస్తారని పొలిటికల్ విశ్లేషకుల నుండి సాధారణ ప్రజలవరకు అంచనా వేశారు. కానీ జూబ్లీహిల్స్ ఓటర్లు మాత్రం కాంగ్రెస్ కు పట్టంగట్టి అందరి అంచనాలను తలకిందులు చేశారు.

211
కాంగ్రెస్ గెలుపుకు టాప్ 10 కారణాలు

1. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం 

నవీన్ యాదవ్ జూబ్లిహిల్స్ లో స్థానిక అభ్యర్థి... అతడి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కు ఇక్కడ మంచి పలుకుబడి ఉంటుంది. నవీన్ కూడా గతంలో ఈ నియోజకవర్గం నుండి పోటీచేసిన అనుభవం ఉంది. ఇవన్నీ కాంగ్రెస్ కు కలిసివచ్చాయి.

311
2. మజ్లిస్ తో సత్సంబంధాలు

నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ పార్టీలో పనిచేశారు... ఆయన పొలిటికల్ కెరీర్ ఈ పార్టీ నుండే ప్రారంభమయ్యింది. ఇది అతడికి ఎంతగానో ఉపయోగపడింది. జూబ్లీహిల్స్ లో గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో ముస్లిం ఓటర్లు ఉన్నారు... కాబట్టి గతంలో ఎంఐఎంలో పనిచేసినపుడు ముస్లింలకు బాగా దగ్గరయ్యాడు నవీన్. అది ఇప్పుడు పనిచేసింది. AIMIM కూడా ఈ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీలో నిలపలేదు... నవీన్ యాదవ్ కు మద్దతు తెలిపింది.

411
3. కాంగ్రెస్ అధికారంలో ఉండటం

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం నవీన్ యాదవ్ గెలుపుకు ప్రధాన కారణం. అధికారంలో ఉన్నపార్టీని గెలిపిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమని కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో ప్రజలు ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు అండగా నిలిచారు.

511
4. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు. సినీ కార్మికులతో బహిరంగ సభ, నియోజకవర్గంలో రోడ్ షో లతో ప్రచారాన్ని హోరెత్తించారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు   ఘాటైన మాటలతో తిప్పికొట్టారు. ఇలా సీఎం ప్రచారం కాంగ్రెస్ కు బాగా పనిచేసింది.

611
5. అజారుద్దిన్ కు మంత్రిపదవి

టీమిండియా మాజీ క్రికెటర్ కు మంత్రి పదవి కూడా నవీన్ యాదవ్ గెలుపులో కీ రోల్ పోషించిందనే చెప్పాలి. కాంగ్రెస్ హయాంలో ముస్లిం నాయకులకు ప్రాధాన్యత తగ్గిందనే ప్రచారానికి ఈ మంత్రి పదవితో చెక్ పెట్టారు రేవంత్. అంతేకాదు గతంలో జూబ్లీహిల్స్ లో పోటీచేసిన అనుభవం అజారుద్దిన్ కు ఉంది... అందుకే అతడి మంత్రిపదవి ఇవ్వడం ద్వారా ఆ నియోజకవర్గ ముస్లింల నమ్మకాన్ని కాంగ్రెస్ సాధించగలింది. అందుకే ముస్లింల ఓట్లన్ని వన్ సైడ్ గా కాంగ్రెస్ కు పడ్డట్లు ఫలితాన్ని బట్టి అర్థమవుతోంది.

711
6. సీఎం రేవంత్ కు టిడిపితో అనుబంధం

రేవంత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉండవచ్చు... కానీ గతంలో ఆయన తెలుగు దేశం పార్టీలో కీలక నాయకుడు. ఇప్పటికీ అతడు తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడే అని... సీనియర్ ఎన్టీఆర్ తనకు స్పూర్తి అని చెబుతుంటారు. ఎన్నికల ప్రచారంలోనూ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ జూబ్లిహిల్స్ లో సెటిలైన ఏపీ ఓటర్లపై ప్రభావం చూపించాయి.

811
7. కాంగ్రెస్ శ్రేణులంతా కలిసివచ్చి ప్రచారం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీని గెలిపించుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులంతా కదిలారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల నుండి అన్ని నియోజకవర్గాల్లోని సామాన్య నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. ఇలా రాష్ట్ర నాయకత్వమంతా ఈగోలు, విబేధాలను పక్కనబెట్టి కలిసికట్టుగా పనిచేసి నవీన్ యాదవ్ ను గెలిపించుకున్నారు.

911
8. పోల్ మేనేజ్మెంట్

అధికార బలం ఉంది... అభ్యర్థి కూడా ఆర్థికంగా బలంగా ఉన్నాడు... పోల్ మేనేజ్మెంట్ ఎలాచేయాలో తెలిసిన నాయకులున్నారు... ఇవన్నీ కాంగ్రెస్ గెలుపుకు కలిసివచ్చిన అంశాలే.

1011
9. మాగంటి కుటుంబంలో విబేధాలు

మాగంటి గోపినాథ్ మరణం తర్వాత ఆయన కుటుంబంలో విబేధాలు మొదలయ్యాయి… కానీ ఎన్నికల సమయంలో ఇవి తారాస్థాయికి చేరాయి. బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ నే క్యాన్సిల్ చేయించే స్థాయికి విబేధాలు చేరాయి. అంతేకాదు స్వయంగా మాగంటి గోపినాథ్ తల్లి బయటకు వచ్చి తన కొడుకు చావుపై అనుమానాలున్నాయంటూ కోడలు సునీతతో పాటు మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. మాగంటి మొదటి భార్య, కొడుకు కూడా సునీతపై తీవ్ర ఆరోపణలు చేశాయి. ఇలా మాగంటి కుటుంబ విబేధాలు కూడా కాంగ్రెస్ కు కలిసివచ్చాయని చెప్పవచ్చు.

1111
10. కేసీఆర్ ప్రచారం చేయకపోవడం

చివరగా కాంగ్రెస్ విజయానికి మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఓ కారణమే అని చెప్పవచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో కేసీఆర్ ప్రచారం చేపట్టకపోవడం కాంగ్రెస్ కు కలిసివచ్చింది. ఓడిపోయే దగ్గర ప్రచారం ఎందుకని కేసీఆర్ దూరంగా ఉన్నారని కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఇది జూబ్లీహిల్స్ ఓటర్లపై ప్రభావం చూపింది. కేసీఆర్ ప్రచారంలో పాల్గొనివుంటే బిఆర్ఎస్ కు మరికొన్ని ఓట్లు పెరిగేవని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 

Read more Photos on
click me!

Recommended Stories