Jio AI Education : జియో ఏఐ ఎడ్యుకేషన్.. విద్యార్థులకు, టీచర్లకు రూ. 35 వేల విలువైన ప్లాన్ ఉచితం !

Published : Jan 27, 2026, 08:24 PM IST

Jio AI Education : రిలయన్స్ జియో, గూగుల్ జెమినై ప్రో భాగస్వామ్యంతో ఏపీ, తెలంగాణలో డిజిటల్ విద్యా విప్లవం మొదలైంది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఉచిత ఏఐ శిక్షణతో పాటు రూ.35,100 విలువైన ప్లాన్ ఉచితంగా అందిస్తోంది. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

PREV
15
గూగుల్ జెమినైతో జియో దోస్తీ: ఏపీ, తెలంగాణలో డిజిటల్ విప్లవం

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో విద్యా రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో డిజిటల్ అంతరాలను చెరిపివేయడమే లక్ష్యంగా భారీ విద్యా ప్రచారాన్ని ప్రారంభించింది. ఆధునిక విద్యా విధానంలో కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలను విద్యార్థులకు, ఉపాధ్యాయులకు చేరువ చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. 

ఇందులో భాగంగా గూగుల్ జెమినై ప్రో (Google Gemini Pro) వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంపై జియో దృష్టి సారించింది. తరగతి గదుల్లోకి ఏఐ టూల్స్ తీసుకురావడం ద్వారా, భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన డిజిటల్ నైపుణ్యాలను యువతకు అందించడానికి జియో ప్రణాళికలు రచిస్తోంది.

25
వేల సంఖ్యలో పాఠశాలలకు ఏఐ విద్యా విస్తరణ

ఈ ప్రత్యేక ప్రచారం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ పొందుతోంది. ఇప్పటివరకు రెండు రాష్ట్రాల్లోని 2200 కంటే ఎక్కువ పాఠశాలలకు జియో బృందాలు విజయవంతంగా చేరుకున్నాయి. జియో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ శిక్షణా కార్యక్రమాల్లో ఏకంగా 27,000 మందికి పైగా ఉపాధ్యాయులు, విద్యార్థులు భాగస్వాములయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లో 1500 కంటే ఎక్కువ పాఠశాలల్లో దాదాపు 20 వేల మందికి శిక్షణ అందుతోంది. తెలంగాణలో 700 పాఠశాలల్లో 7000 వేల మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు.

35
ప్రాక్టికల్ నాలెడ్జ్‌పై ప్రత్యేక దృష్టి

కేవలం సిద్ధాంతపరమైన అంశాలకే పరిమితం కాకుండా, ఆచరణాత్మక అప్లికేషన్లపై ఈ వర్క్‌షాప్‌లు దృష్టి సారిస్తున్నాయి. గూగుల్ జెమినై వ్యవస్థను రోజువారీ విద్యావసరాలకు ఎలా వినియోగించుకోవాలో ఇందులో వివరిస్తున్నారు. ముఖ్యంగా క్లిష్టమైన కోడింగ్ ప్రాజెక్ట్‌లను సులభంగా పరిష్కరించడం, అసైన్‌మెంట్‌లు రాయడం, పాఠ్యాంశాల నోట్స్ తయారు చేసుకోవడం వంటి పనుల్లో ఏఐ సహాయాన్ని ఎలా తీసుకోవాలో నేర్పిస్తున్నారు. 

భవిష్యత్తులో వృత్తిపరమైన వృద్ధికి అవసరమైన ప్రాజెక్ట్ ఐడియేషన్, గ్రాఫిక్ డిజైన్, ఇంటర్వ్యూలకు సిద్ధమవడం వంటి అంశాల్లో కూడా శిక్షణ ఇస్తున్నారు.

45
రూ. 35,100 విలువైన ప్లాన్ పూర్తిగా ఉచితం

ఈ డిజిటల్ సాధికారత ప్రచారంలో జియో ప్రకటించిన ఆఫర్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. జియో అన్‌లిమిటెడ్ 5G సబ్‌స్క్రైబర్‌లకు సుమారు ₹35,100 విలువ చేసే గూగుల్ జెమినై ప్రో ప్లాన్ ను 18 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. మైజియో (MyJio) యాప్ ద్వారా వినియోగదారులు దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఈ ప్లాన్ ద్వారా లభించే ప్రయోజనాలు ఇవే

• అత్యాధునిక జెమిని 3 ప్రో మోడల్ యాక్సెస్.

• ఏఐతో ఫోటోలను రూపొందించే నానో బనానా ప్రో (Nano Banana Pro).

• వీడియో జనరేషన్ కోసం వీయో 3.1 (Veo 3.1) టూల్.

• అకడమిక్ రీసెర్చ్ కోసం ఉపయోగపడే నోట్‌బుక్ ఎల్ఎమ్ (NotebookLM).

• డిజిటల్ డేటాను భద్రపరుచుకోవడానికి 2 TB క్లౌడ్ స్టోరేజ్.

55
జియో ఏఐ క్లాస్‌రూమ్: 4 వారాల సర్టిఫికేషన్

యువతలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు జియో ఏఐ క్లాస్‌రూమ్ అనే ఉచిత ఆన్‌లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. ఇది నాలుగు వారాల పాటు జరిగే కోర్సు. విద్యార్థులు తమకు వీలైన సమయంలో డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా ఈ కోర్సును పూర్తి చేయవచ్చు. జియో అధికారిక వెబ్‌సైట్ Jio.com/ai-classroom ద్వారా విద్యార్థులు ఈ శిక్షణను పొందవచ్చు. ప్రపంచ స్థాయి డిజిటల్ పోటీని తట్టుకునేలా ప్రాంతీయ శ్రామిక శక్తిని తీర్చిదిద్దడమే ఈ కోర్సు ప్రధాన లక్ష్యం.

Read more Photos on
click me!

Recommended Stories