Telangana Municipal elections: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం పడింది. ఎన్నికల నోటిఫికేష్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలు..
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు పూర్తిచేసి ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం ఈ ఎన్నికల పరిధిలోకి రాదు.
25
నామినేషన్ల షెడ్యూల్ – కీలక తేదీలు
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల 28 నుంచి 30 వరకు రెండు రోజులపాటు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల పరిశీలన అనంతరం ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను వేగవంతం చేశా
35
అభ్యర్థుల అర్హతలు – ఎవరు పోటీ చేయవచ్చు
ఎన్నికల్లో పోటీ చేసే వారు భారత పౌరులై ఉండాలి. కనీస వయస్సు 21 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. కార్పొరేషన్ అభ్యర్థులు ఆ కార్పొరేషన్ పరిధిలోని ఏదైనా వార్డులో ఓటరుగా నమోదు అయి ఉండాలి. మున్సిపాలిటీ అభ్యర్థులు సంబంధిత మున్సిపాలిటీ పరిధిలో ఓటరుగా ఉండటం తప్పనిసరి. ప్రభుత్వ కాంట్రాక్టర్లు, లాభదాయక పదవుల్లో ఉన్న వ్యక్తులు, గత ఎన్నికల్లో వ్యయ వివరాలు సమర్పించని కారణంగా అనర్హతకు గురైన వారు పోటీకి అర్హులు కారు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సేవల నుంచి తొలగించబడిన వారు కూడా ఎన్నికలకు దూరంగా ఉండాలి. దివాలా ప్రకటించబడిన వ్యక్తులకు పోటీ చేసే హక్కు ఉండదు.
అభ్యర్థులు ఎన్నికల అధికారి నుంచి పొందిన నామినేషన్ ఫారాన్ని సమర్పించాలి. ఆస్తులు, అప్పులు, ఆదాయాలు, క్రిమినల్ కేసుల వివరాలతో కూడిన అఫిడవిట్ తప్పనిసరి. ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు ప్రతులు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు జత చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్ స్థానాల్లో పోటీ చేసే వారు రెవెన్యూ శాఖకు చెందిన డిప్యూటీ ఎమ్మార్వో స్థాయి అధికారి ఎదుట ఇచ్చిన డిక్లరేషన్‌ను సమర్పించాలి. రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే వారు బీ-ఫామ్ తీసుకొని రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి. స్వతంత్ర అభ్యర్థులకు ఆ వార్డులోని 10 మంది ఓటర్ల ప్రతిపాదన తప్పనిసరి.
55
వ్యయ పరిమితులు, డిపాజిట్ నిబంధనలు
ఎన్నికల ఖర్చుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కఠిన నిబంధనలు విధించింది. కార్పొరేషన్ అభ్యర్థులకు గరిష్టంగా రూ.10 లక్షలు, గ్రేడ్-1 మున్సిపాలిటీ అభ్యర్థులకు రూ.5 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయడానికి అనుమతి ఉంది. నామినేషన్‌కు ముందే ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలి. ప్రచార ఖర్చులన్నీ అదే ఖాతా ద్వారా జరగాలి. డిపాజిట్ విషయానికి వస్తే మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.1,250, ఇతరులకు రూ.2,500 నిర్ణయించారు. కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.2,500, ఇతరులకు రూ.5,000 డిపాజిట్ చెల్లించాలి. రిజర్వ్ స్థానాల్లో పోటీ చేసే వారు కుల ధృవీకరణ పత్రం జత చేయడం తప్పనిసరి.