Hyderabad Real estate: హైదరాబాద్‌లో సొంతిళ్లు చాలా మంది కల. అయితే పెరిగన ధరల నేపథ్యంలో చాలా మందికి ఇది కష్టంగా మారుతోంది. కానీ హైదరాబాద్‌కు కాస్త దూరంలో ఉన్న ఓ ప్రాంతంలో త్వరలోనే రియల్ బూమ్ రానుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్ (RRR) పనులను మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా సంగారెడ్డి సమీపంలో జాతీయ రహదారి–65కు కలిసే భారీ జంక్షన్ నిర్మాణం ప్రతిపాదించారు. ఈ ఇంటర్‌చేంజ్ చుట్టుపక్కల ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు ఉన్నాయి. ఈ ప్రకటనతోనే సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కదలికలు వేగంగా పెరిగాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతం నగరానికి సమీపంగా అభివృద్ధి చెందుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.
25
భూముల ధరల్లో భారీ పెరుగుదల
సంగారెడ్డి–జహీరాబాద్ జాతీయ రహదారి పరిధిలో ఒకప్పుడు ఎకరాకు రూ.1.4 కోట్ల నుంచి రూ.2.3 కోట్ల మధ్య ధరలు ఉండేవి. ఇప్పుడు RRR జంక్షన్ కారణంగా అదే భూమి ఎకరాకు రూ.3 కోట్ల వరకు చేరింది. హైవేకు 5–10 కిలోమీటర్ల పరిధిలో ఎకరాకు రూ.70 లక్షల నుంచి రూ.1 కోట్ల వరకు కోటేషన్లు వినిపిస్తున్నాయి. సదాశివపేట, ఆరూర్, బుధేరా, జహీరాబాద్ ప్రాంతాల్లో కూడా పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో ఆ ప్రాంతం మొత్తం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
35
డీటీసీపీ లేఅవుట్లలో ప్లాట్ల రేట్లు
సంగారెడ్డి పట్టణ పరిధిలో DTCP అనుమతులతో ఉన్న లేఅవుట్లలో చదరపు గజానికి రూ.12,000 నుంచి రూ.30,000 వరకు ధరలు ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాల్లో రూ.8,000 నుంచి రూ.22,000 వరకు రేట్లు చెబుతున్నారు. సదాశివపేటలో చదరపు గజానికి రూ.8,000–రూ.18,000 మధ్య ధరలు ఉండగా, జహీరాబాద్‌లో రూ.12,000–రూ.25,000 వరకు ఉన్నాయి.
రుద్రారం అవుటర్ రింగ్ రోడ్ జంక్షన్ పరిసర ప్రాంతాలు ఇప్పటికీ పూర్తిగా అభివృద్ధి కాలేదు. ఆసుపత్రులు, పాఠశాలలు, కాలేజీలు, షాపింగ్ మాల్స్ వంటి ప్రాథమిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. చాలా మంది అవసరాల కోసం పటాన్‌చేరు లేదా లింగంపల్లి వెళ్లాల్సి వస్తోంది.
55
రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఎలా ఉండొచ్చు?
RRR పూర్తయిన తర్వాత ఈ ప్రాంతాల్లో నిజమైన మార్పు మొదలవుతుంది. రహదారి కనెక్టివిటీ పెరిగితే పరిశ్రమలు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ హబ్‌లు ఏర్పడే అవకాశం ఉంది. దాని ప్రభావంతో నివాస కాలనీలు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు పెరుగుతాయి. అదే విధంగా రీజినల్ రింగ్ రోడ్ నుంచి రింగ్ రోడ్డు నుంచి పటాన్ చెరు కేవలం 30 నిమిషాల్లో చేరుకునే అవకాశం లభిస్తుంది. తాజాగా మెట్రో రెండో దశలో భాగంగా ఇప్పటికే మియాపూర్ నుంచి పటాన్ చెర్ మార్గానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రీజినల్ రింగ్ రోడ్డు నుంచి నగరంలోని ఏ ప్రాంతానికైనా కేవలం గంటన్నర నుంచి రెండు గంటల్లో చేరుకునే వెసులుబాటు లభించనుంది. దీంతో ఈ ప్రాంతంతో భవిష్యత్తులో హైదరాబాద్‌కు వేగవంతమైన కనెక్టివిటీ లభించనుంది. కాబట్టి హైదరాబాద్‌లో సొంతింటి కల నెరవేర్చుకోలేని వారికి సంగారెడ్డి సమీపంలోని రీజినల్ రింగ్ రోడ్డు వద్ద పెట్టుబడి పెట్టడం కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టే ముందు నిపుణులు సూచనలు పాటించడమే ఉత్తమం.