Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!

Published : Dec 22, 2025, 12:28 PM IST

Holidays : క్రిస్మస్ పండక్కి డిసెంబర్ 25, 26 రెండ్రోజులు అధికారికంగా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కానీ ఓరోజు ముందుగానే ఈ సెలవులు ప్రారంభం అవుతున్నాయి. డిసెంబర్ 24న కూడా తెలుగోళ్లకు సెలవేనా..?

PREV
15
క్రిస్మస్ సెలవులు ఎన్నిరోజులో తెలుసా?

School Holidays : దేశవ్యాప్తంగా క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే పండగ క్రిస్మస్... ఇప్పటికే చాలామంది ఇంటిని స్టార్స్, క్రిస్మస్ ట్రీ తో అలంకరించుకున్నారు. ఇక పండగపూట కొత్త బట్టలు ధరించి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు... కేక్ కటింగ్స్, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, ఊరేగింపులతో ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థులకు సెలవులు మొదలయ్యాయి... తెలుగు రాష్ట్రాల్లో కూడా ముందుగానే క్రిస్మస్ సెలవులు వస్తున్నాయి. రేపు (మంగళవారం) ఒక్కరోజు వర్కింగ్ డే.. బుధవారం నుండి క్రిస్మస్ హాలిడేస్ ప్రారంభం అవుతాయి.

25
డిసెంబర్ 24న సెలవే..?

క్రిస్మస్ పండగ డిసెంబర్ 25న (గురువారం) ఉంది... కానీ ముందురోజు క్రిస్మస్ ఈవ్ వేడుకలు జరుపుకుంటారు. యేసు క్రీస్తు పుట్టుకకు ముందురోజును కూడా చాలా పవిత్రంగా భావిస్తారు... అందుకే ఆ ప్రభువు కోసం రాత్రంతా జాగరణ చేస్తూ ప్రార్థనలు చేస్తారు. అందుకే ఈ రోజును క్రిస్మస్ ఈవ్ లేదా హోలీ నైట్ అనికూడా అంటారు.

ఇలా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యే డిసెంబర్ 24న కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు సెలవు ప్రకటించాయి. కానీ ఇది సాధారణ సెలవు కాదు... ప్రత్యేక సెలవు. డిసెంబర్ 24న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తెరిచివుంటాయి... ఉద్యోగులకు వర్కింగ్ డేనే... కానీ ఈరోజు సెలవు కావాలనుకునేవారు మాత్రం ముందుగానే సమాచారం ఇచ్చి ఐచ్చిక సెలవు పొందవచ్చు. అంటే ఇది వేతనంతో కూడిన సెలవు అన్నమాట.

ఇక క్రిస్టియన్ మైనారిటీలు ఎక్కువగా చదువుకునే స్కూళ్లకు కూడా క్రిస్మస్ ఈవ్ సెలవు ఇస్తారు. అయితే ఇది ఆయా స్కూల్ యాజమాన్యాల నిర్ణయం. ఈరోజు సెలవు ఉండే విద్యాసంస్థలకు వరుస సెలవులు కలిసివస్తాయి. ప్రభుత్వ విద్యాసంస్థలకు మాత్రం డిసెంబర్ 24న ఎలాంటి సెలవు ఉండదు.

35
డిసెంబర్ 25, 26 అధికారిక సెలవు...

డిసెంబర్ 25న క్రిస్మస్... తర్వాతిరోజు అంటే డిసెంబర్ 26న బాక్సింగ్ డే. ఈ రెండ్రోజులు తెలంగాణలో అధికారిక సెలవులే. అంటే ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికి ఈ రెండ్రోజులు సెలవే.

ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం కేవలం క్రిస్మస్ ఒక్కరోజు (డిసెంబర్ 25న) మాత్రమే అధికారిక సెలవు. ముందురోజు డిసెంబర్ 24, తర్వాతరోజు డిసెంబర్ 26 రెండ్రోజులు ఐచ్చిక సెలవులే. అంటే ఈ రెండ్రోజులు విద్యాసంస్థలు యదావిధిగా నడుస్తాయి... ప్రభుత్వ ఉద్యోగులు అవసరం అనుకుంటే ముందుగానే అనుమతి తీసుకుని ఐచ్చిక సెలవు తీసుకునే అవకాశం ఉంటుంది.

45
డిసెంబర్ 27, 28 సెలవు...

హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు... వీరికి ప్రతి వీకెండ్ రెండ్రోజులు (శని, ఆదివారం) సెలవు ఉంటుంది. ఈ క్రమంలోనే ఐటీ, కార్పోరేట్ సంస్థల ఉద్యోగుల పిల్లలు ఎక్కువగా చదివే కొన్ని కార్పోరేట్ విద్యాసంస్థలు కూడా వీకెండ్ రెండ్రోజులు సెలవులు ఇస్తుంటాయి. ఇలాంటి విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఈ క్రిస్మస్ సెలవులు కలిసిరానున్నాయి. ఒకటి రెండ్రోజులు కాదు వరుసగా నాలుగు రోజులు (డిసెంబర్ 25,26,27,28) సెలవులు వస్తున్నాయి.

55
జనవరి ఫస్ట్ కూడా సెలవే...

పాత సంవత్సరం 2025 కి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరం 2026 లో అడుగుపెట్టే రోజే మరో సెలవు రానుంది. జనవరి ఫస్ట్ న తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులకు ఐచ్చిక సెలవు ఉంది. అంటే నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేవారు ఈరోజు వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. క్రిస్మస్ సెలవులు ఇలా ముగుస్తాయో లేదో అలా న్యూఇయర్ సెలవు వస్తుంది... అది ముగియగానే మళ్లీ వీకెండ్ (రెండో శనివారం, ఆదివారం) రెడీగా ఉంటాయి.

ఇక జనవరి సెకండ్ వీక్ నుండే తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రారంభం అవుతాయి. ఉద్యోగులకు కూడా జనవరి 13, 14, 15 మూడ్రోజులు సెలవులున్నాయి. రెండో శనివారం, ఆదివారాలు కలుపుకుని కొద్దిగా ప్లాన్ చేసుకుంటే ఉద్యోగులు కూడా జనవరి 10 నుండే 18 వరకు సెలవులు పొందవచ్చు. ఇలా క్రిస్మస్ తో ప్రారంభమయ్యే సెలవులు సంక్రాంతి వరకు కొనసాగనున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories