IMD Rain Alert : తెలంగాణలో వర్షాలు ... ఎప్పట్నుంచో తెలుసా?

Published : Dec 22, 2025, 07:49 AM ISTUpdated : Dec 22, 2025, 08:08 AM IST

IMD Rain Alert : తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు వెదర్ మ్యాన్ ప్రకటించారు. ఎప్పట్నుంచి వానలుపడే అవకాశాలున్నాయంట తెలుసా?

PREV
15
తెలంగాణలో వర్షాలు..?

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది... ఉష్ణోగ్రతలు కుప్పకూలిపోయాయి. తెలంగాణలో డిసెంబర్ ప్రారంభంనుండే చలి ఇరగదీస్తోంది... ప్రస్తుతం గజగజా వణికిస్తోంది. ఇలా చలి గాలులతోనే సతమతం అవుతున్న ప్రజలను కంగారుపెట్టేలా వర్షసూచనలు వెలువడ్డాయి. శీతాకాలంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు.

25
తెలంగాణ వాతావరణం చేంజ్

ప్రస్తుతం వీస్తున్న చలిగాలులు జనవరిలో కూడా కొనసాగుతాయని.. అయితే ఈ నెల చివర్లో వీటికి వర్షాలు కూడా తోడయ్యే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు. జనవరి లాస్ట్ వీక్ లో వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇలా వచ్చేనెల చలిగాలులకు వర్షాలు తోడై పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.

35
ఇరగదీస్తున్న చలి

ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణలో ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయిలో నమోదవుతున్నాయి. చలిలో హైదరాబాద్ ఆదిలాబాద్ తో పోటీ పడుతోంది... ఈ రెండు చోట్ల 7.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ పటాన్ చెరులో అతి తక్కువ ఉష్ణోగ్రతలున్నాయి... ఇక్కడ తెల్లవారుజామున విపరీతమైన పొగమంచు కురుస్తోంది. దీంతో వాాకింగ్ కోసం బయటకు వచ్చేవారే కాదు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

45
అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే..

మెదక్ జిల్లాలో కూడా ఆదిలాబాద్ స్థాయిలోనే చలి ఉంది... ఇక్కడ 7.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హన్మకొండలో 10.5 నిజామాబాద్ లో 11.7, రామగుండంలో 11.9, నల్గొండలో 13.4, ఖమ్మంలో 14, మహబూబ్ నగర్ లో 14.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మిగతా జిల్లాల్లో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలుండి విపరీతమైన చలిగాలులు వీస్తున్నాయి.

55
ఈ జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త

ఇప్పట్లో చలి తగ్గేలా లేదు... ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత దిగువకు చేరుకుంటాయని... దీంతో చలి పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే రెండుమూడు రోజులు ఈ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు తగ్గే అవకావాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Read more Photos on
click me!

Recommended Stories