ఆ అధికారులకు తిప్పలు తప్పవా?: బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలపై ఫోకస్ పెట్టిన రేవంత్

First Published Jan 9, 2024, 4:39 PM IST

తెలంగాణలో  బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై  కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. 

ఆ అధికారులకు తిప్పలు తప్పవా?: బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలపై ఫోకస్ పెట్టిన రేవంత్

తెలంగాణ రాష్ట్రంలో  భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న సమయంలో  నిబంధనలకు విరుద్దంగా  వ్యవహరించిన  అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.  ప్రతిపక్షంలో ఉన్న సమయంలో  భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంపై చేసిన విమర్శల నేపథ్యంలో  రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలను ప్రారంభించింది. 

also read:కేసీఆర్ సహా ఆ ముగ్గురు పార్లమెంట్‌కేనా: బీఆర్ఎస్ వ్యూహం ఏమిటీ?

ఆ అధికారులకు తిప్పలు తప్పవా?: బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలపై ఫోకస్ పెట్టిన రేవంత్

2023నవంబర్ మాసంలో  జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  2014 నుండి 2023 వరకు  తెలంగాణ రాష్ట్రంలో  బీఆర్ఎస్  అధికారంలో ఉంది.  గత ఏడాది జరిగిన ఎన్నికల్లో  బీఆర్ఎస్ ఓటమి పాలై  కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

also read:మేడిగడ్డపై అధికారులకు ఉచ్చు: 12 చోట్ల ఏకకాలంలో విజిలెన్స్ సోదాలు

ఆ అధికారులకు తిప్పలు తప్పవా?: బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలపై ఫోకస్ పెట్టిన రేవంత్

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా  ఉన్న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటుకు  గురయ్యాయి.  ఈ విషయమై  అధికారంలోకి రాగానే  అనుముల రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలను ప్రారంభించింది.  మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుపై  జ్యుడిషీయల్ విచారణ చేస్తామని  రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ శాసనమండలిలో ఈ ప్రకటన చేశారు. 

also read:అరవింద్ ‌కు బిగుస్తున్న ఉచ్చు: ఫార్మూలా ఈ-రేస్ కు రూ. 50 కోట్ల విడుదలపై మెమో జారీ

ఆ అధికారులకు తిప్పలు తప్పవా?: బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలపై ఫోకస్ పెట్టిన రేవంత్

అయితే  ఇటీవల కాలంలో  నీటిపారుదల శాఖకు  చెందిన  కార్యాలయంలో  కీలకమైన కంప్యూటర్లు, ఫైల్స్ మాయమయ్యాయి. దీంతో  విజిలెన్స్ విచారణకు  రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  దీంతో  మంగళవారంనాడు రాష్ట్ర వ్యాప్తంగా  12 చోట్ల  విజిలెన్స్ అధికారులు తనిఖీలు ఏక కాలంలో తనిఖీలు చేస్తున్నారు.

also read:జిల్లాల బాట పట్టనున్న రేవంత్ రెడ్డి: ఇంద్రవెల్లి నుండి శ్రీకారం

ఆ అధికారులకు తిప్పలు తప్పవా?: బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలపై ఫోకస్ పెట్టిన రేవంత్

 నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా ఉన్న మురళీధర్ రావుపై  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి ఆరోపణలు చేశారు. మురళీధర్ రావును  ఈఎన్సీ బాధ్యతల నుండి తప్పించాలని డిమాండ్ చేశారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు  ఈఎన్సీ‌ మురళీధర్ రావుపై  జీవన్ రెడ్డి ఆరోపణలు చేశారు.   నిబంధనలకు విరుద్దంగా  బీఆర్ఎస్ సర్కార్ లో  అధికారులు కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని  కాంగ్రెస్ నేతలు అప్పట్లో  ఆరోపణలు చేశారు. 

also read:తెలంగాణ అసెంబ్లీలో బీజేపీపక్షనేత ఎవరు?: రేసులో ఆ నలుగురు

ఆ అధికారులకు తిప్పలు తప్పవా?: బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలపై ఫోకస్ పెట్టిన రేవంత్

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరిగిన జిల్లాల్లోని  నీటిపారుదల శాఖ కార్యాలయాల్లో  విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు.  విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా  బాధ్యులైన అధికారులపై  చర్యలు తీసుకోనుంది  ప్రభుత్వం. మరో వైపు జ్యుడీషీయల్ విచారణకు  కూడ  చేపట్టనుంది. ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు  అవసరమైన కసరత్తును  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది.

also read:కారణమిదీ: స్వంత పార్టీ నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు

ఆ అధికారులకు తిప్పలు తప్పవా?: బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలపై ఫోకస్ పెట్టిన రేవంత్

రాష్ట్రంలో రైతాంగానికి  24 గంటల పాటు విద్యుత్ ను సరఫరా చేసినట్టుగా భారత రాష్ట్ర సమితి సర్కార్  అప్పట్లో ప్రచారం చేసింది. అయితే  24 గంటల విద్యుత్ విషయంలో  ఏం జరిగిందనే  విషయాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు  వివరించింది. విద్యుత్ శాఖపై శ్వేత పత్రం విడుదల చేసింది . ఈ శ్వేత పత్రంలో అన్ని విషయాలను  పొందుపర్చింది.  

also read:తెలంగాణలో జిల్లాలు తగ్గుతాయా, పెరుగుతాయా?: అధికారులతో కమిటీ ఏర్పాటు యోచనలో రేవంత్

ఆ అధికారులకు తిప్పలు తప్పవా?: బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలపై ఫోకస్ పెట్టిన రేవంత్

భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంతో పాటు  ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై  జ్యుడీషీయల్ విచారణకు  రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.  తెలంగాణ అసెంబ్లీ వేదికగా  ఈ విషయాన్ని  ఆయన ప్రకటించారు. 

also read:తెలంగాణకు మోడీ: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

ఆ అధికారులకు తిప్పలు తప్పవా?: బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలపై ఫోకస్ పెట్టిన రేవంత్

ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా  పనిచేసిన ప్రభాకర్ రావు  రాజీనామాను ఆమోదించవద్దని కూడ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.  విద్యుత్ శాఖపై సమీక్ష సమావేశానికి  ప్రభాకర్ రావును కూడ హాజరయ్యేలా చూడాలని కోరింది. అయితే  ఈ సమావేశానికి ప్రభాకర్ రావు హాజరు కాలేదు. అయితే ఈ సమావేశానికి హాజరు కావాలని తనకు  ఎవరూ కూడ సమాచారం ఇవ్వలేదని  అప్పట్లో ప్రభాకర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే.

also read:మిషన్ ఇంపాజిబుల్ సినిమా తరహాలోనే: కేబుల్ వైర్లపై పిల్లి వాకింగ్, నెట్టింట్లో వీడియో వైరల్

ఆ అధికారులకు తిప్పలు తప్పవా?: బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలపై ఫోకస్ పెట్టిన రేవంత్

  ఫార్మూలా ఈ-రేస్ విషయంలో    రూ. 50 కోట్ల విడుదల విషయమై అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్  అరవింద్ కుమార్ కు  తెలంగాణ ప్రభుత్వం  మెమో జారీ చేసింది. ప్రధానమైన తొమ్మిది అంశాలను ఈ మెమోలో ప్రస్తావించింది.  ఈ మెమోకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సమాధానం సంతృప్తికరంగా లేకపోతే  చర్యలు తీసుకొనే అవకాశం లేకపోలేదు.

also read:విమానంలో మహిళ డ్యాన్స్: వైరల్‌గా మారిన వీడియో

ఆ అధికారులకు తిప్పలు తప్పవా?: బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలపై ఫోకస్ పెట్టిన రేవంత్

దాదాపుగా పదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో  నిబంధనలకు విరుద్దంగా  చేపట్టిన పనులపై కాంగ్రెస్ సర్కార్  అన్వేషణ ప్రారంభించింది.  ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది.అయితే ఈ విషయమై  అన్ని ఆధారాలను  ప్రజల ముందు పెట్టిన తర్వాతే  చర్యలు తీసుకోవాలని భావిస్తుంది. ప్రస్తుతం ఆధారాలను బయటపెట్టేందుకు  ప్రయత్నాలు ప్రారంభించింది కాంగ్రెస్ సర్కార్.

also read:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: గెలుపునకు కావాల్సిన ఓట్లను ఎలా నిర్ధారిస్తారు

click me!