జిల్లాల బాట పట్టనున్న రేవంత్ రెడ్డి: ఇంద్రవెల్లి నుండి శ్రీకారం

First Published | Jan 8, 2024, 10:28 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  జిల్లాల పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారు.

జిల్లాల బాట పట్టనున్న రేవంత్ రెడ్డి: ఇంద్రవెల్లి నుండి శ్రీకారం

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.2023  నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి  గత ఏడాది డిసెంబర్  7వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు.  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజులు పూర్తైంది. 

also read:తుంటి విరిగిందా: రేవంత్ రెడ్డికి కొడాలి నాని కౌంటర్

జిల్లాల బాట పట్టనున్న రేవంత్ రెడ్డి: ఇంద్రవెల్లి నుండి శ్రీకారం

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో  పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో  పార్లమెంట్ ఎన్నికల్లో  తెలంగాణ రాష్ట్రంలో కనీసం  12 పార్లమెంట్ స్థానాలను దక్కించుకోవాలని  ఆ పార్టీ వ్యూహరచన చేస్తుంది. 

also read:తెలంగాణ అసెంబ్లీలో బీజేపీపక్షనేత ఎవరు?: రేసులో ఆ నలుగురు


జిల్లాల బాట పట్టనున్న రేవంత్ రెడ్డి: ఇంద్రవెల్లి నుండి శ్రీకారం


ఈ నెల 8వ తేదీన హైద్రాబాద్ లో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్,మహబూబ్ నగర్,హైద్రాబాద్ నేతలతో  సీఎం రేవంత్  రెడ్డి సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.పార్లమెంట్ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని  నేతలకు  రేవంత్ రెడ్డి సూచించారు.

also read:కారణమిదీ: స్వంత పార్టీ నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు

జిల్లాల బాట పట్టనున్న రేవంత్ రెడ్డి: ఇంద్రవెల్లి నుండి శ్రీకారం

 
ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి  ప్లాన్ చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో  రేవంత్ రెడ్డి తొలి సభ నిర్వహించాలని రేవంత్ రెడ్డి  నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా నేతలకు  రేవంత్ రెడ్డి  సూచించారు. ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతి వనం శంకుస్థాపన ఏర్పాట్లు చేయాలని సూచించారు.  
ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను ఆదుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వీలును చూసుకొని  జిల్లాల్లో పర్యటించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తొలుత  ఇంద్రవెల్లి నుండి జిల్లాల పర్యటనకు  రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు.

తెలంగాణలో జిల్లాలు తగ్గుతాయా, పెరుగుతాయా?: అధికారులతో కమిటీ ఏర్పాటు యోచనలో రేవంత్also read:

జిల్లాల బాట పట్టనున్న రేవంత్ రెడ్డి: ఇంద్రవెల్లి నుండి శ్రీకారం


జిల్లాల పర్యటనలతో పాటు ఎమ్మెల్యేలకు  కూడ అందుబాటులో ఉండాలని  సీఎం నిర్ణంయ తీసుకున్నారు.  ఈ నెల  26వ తేదీ తర్వాత  ప్రతి రోజూ  సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు సచివాలయంలో  ఎమ్మెల్యేలకు  సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో ఉంటారు.

also read:విమానంలో మహిళ డ్యాన్స్: వైరల్‌గా మారిన వీడియో

జిల్లాల బాట పట్టనున్న రేవంత్ రెడ్డి: ఇంద్రవెల్లి నుండి శ్రీకారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగే  పార్లమెంట్ ఎన్నికలు రేవంత్ రెడ్డికి పరీక్ష. ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోకపోతే   ఆ పార్టీకి రాజకీయంగా ప్రత్యర్ధులు పైచేయి సాధించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాన్ని  విశ్లేషకులు వ్యక్తం  చేస్తున్నారు.

also read:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: గెలుపునకు కావాల్సిన ఓట్లను ఎలా నిర్ధారిస్తారు
 

Latest Videos

click me!