కేసీఆర్ సహా ఆ ముగ్గురు పార్లమెంట్‌కేనా: బీఆర్ఎస్ వ్యూహం ఏమిటీ?

First Published Jan 9, 2024, 2:54 PM IST

బీఆర్ఎస్ కీలకనేతలు  పార్లమెంట్ కు పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది.ఈ విషయమై రానున్న రోజుల్లో  స్పష్టత రానుంది. 

భారత రాష్ట్ర సమితికి చెందిన కీలక నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే  ప్రచారం సాగుతుంది. ఈ విషయమై త్వరలోనే  స్పష్టత రానుంది2023  నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  భారత రాష్ట్ర సమితి  కేవలం  39 స్థానాల్లోనే విజయం సాధించింది.  దీంతో  భారత రాష్ట్ర సమితి  రెండు దఫాలు అధికారాన్ని కోల్పోయిన తర్వాత  విపక్షానికి పరిమితమైంది. 

also read:మేడిగడ్డపై అధికారులకు ఉచ్చు: 12 చోట్ల ఏకకాలంలో విజిలెన్స్ సోదాలు

ఈ  ఏడాది ఏప్రిల్ మాసంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలపై  భారత రాష్ట్ర సమితి ఫోకస్ పెట్టింది.   బీఆర్ఎస్ కీలక నేతలు  పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.  తెలంగాణ రాష్ట్రంలోని  19 పార్లమెంట్ స్థానాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని  బీఆర్ఎస్  నాయకత్వం కేంద్రీకరించింది.

also read:అరవింద్ ‌కు బిగుస్తున్న ఉచ్చు: ఫార్మూలా ఈ-రేస్ కు రూ. 50 కోట్ల విడుదలపై మెమో జారీ

KTR

 ఈ నెల  3వ తేదీ నుండి  పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తుంది ఆ పార్టీ.  ఈ సమీక్ష సమావేశాలకు  బీఆర్ఎస్  నేతలు  కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావు సహా ఇతర కీలక నేతలు హాజరౌతున్నారు.

also read:జిల్లాల బాట పట్టనున్న రేవంత్ రెడ్డి: ఇంద్రవెల్లి నుండి శ్రీకారం

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారని  ప్రచారం సాగుతుంది.  మెదక్ పార్లమెంట్ స్థానం నుండి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో  పోటీ చేసే అవకాశం ఉందని  పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

also read:తెలంగాణ అసెంబ్లీలో బీజేపీపక్షనేత ఎవరు?: రేసులో ఆ నలుగురు

KTR, BRS, Telangana,

మరో వైపు  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు  కూడ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయనే  ప్రచారం సాగుతుంది.  సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాల్లో  ఏదో ఒక స్థానం నుండి కేటీఆర్ పోటీ చేస్తారనే చర్చ కూడ లేకపోలేదు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుండి కేటీఆర్  మరోసారి విజయం సాధించారు.  

also read:కారణమిదీ: స్వంత పార్టీ నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు

k kavitha

2014  ఎన్నికల్లో  నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి  కల్వకుంట్ల కవిత  విజయం సాధించారు.  2019 ఎన్నికల్లో  ఇదే స్థానం నుండి  పోటీ చేసిన  కవిత  భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి  ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు.  వచ్చే ఎన్నికల్లో కవిత కూడ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  

also read:తెలంగాణలో జిల్లాలు తగ్గుతాయా, పెరుగుతాయా?: అధికారులతో కమిటీ ఏర్పాటు యోచనలో రేవంత్

kavitha

భారత రాష్ట్ర సమితికి కీలక నేతలు  పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే  రాష్ట్రం పరిస్థితి ఏమిటనే చర్చ కూడ లేకపోలేదు. అయితే  కేటీఆర్, కవిత, కేసీఆర్  పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది

also read:తెలంగాణకు మోడీ: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

KCR, BRS, Telangana

కరీంనగర్, మహబూబ్ నగర్ , మెదక్ పార్లమెంట్ స్థానాల నుండి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ఎంపీగా  ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. తెలంగాణలో  పార్టీ అధికారం కోల్పోవడంతో  జాతీయ రాజకీయాలపై  కేసీఆర్ కేంద్రీకరించే అవకాశాలను కూడ కొట్టిపారేయలేమని  ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  

also read:విమానంలో మహిళ డ్యాన్స్: వైరల్‌గా మారిన వీడియో
 

CM KCR

 దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడ  పార్టీని విస్తరించేందుకు  అవసరమైన వ్యూహరచనకు  కేసీఆర్ కు అవకాశం దక్కుతుందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా   ఇతర పార్టీలకు బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయంతో ఆ పార్టీ ఉంది.

also read:మిషన్ ఇంపాజిబుల్ సినిమా తరహాలోనే: కేబుల్ వైర్లపై పిల్లి వాకింగ్, నెట్టింట్లో వీడియో వైరల్

click me!