వొడాఫోన్ ఐడియా త్వరలో మూతపడనుందా..? బకాయిలు, స్పెక్ట్రమ్‌ చెల్లింపులకూ కష్టాలు..

First Published | Jul 2, 2021, 1:10 PM IST

న్యూఢిల్లీ:  ఆదిత్య బిర్లా గ్రూప్‌  చెందిన వొడాఫోన్‌  గ్రూప్‌ సంయుక్త కంపెనీ వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ (వీఐఎల్‌) టెలికాం కంపెనీ మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.44,233 కోట్ల  నష్టాలను చవిచూసింది. ఇందులో జనవరి-మార్చి త్రైమాసిక నష్టాలు (రూ.6,985 కోట్లు) కూడా ఉన్నాయి.  

మరోవైపు సబ్‌స్ర్కైబర్లు కూడా వొడాఫోన్‌ ఐడియా సేవలకు గుడ్‌బై చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలోనూ దాదాపు 20 లక్షల మంది వొడాఫోన్‌ ఐడియాకి గుడ్‌బై చెప్పారు. దీంతో మార్చి నెలాఖరుకు నాటికి కంపెనీ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 27 కోట్లకు పడిపోయింది.
undefined
ఈ ఏడాది మార్చి చివరి నాటికి వొడాఫోన్‌ ఐడియా అప్పులు, ఏజీఆర్‌, స్పెక్ట్రమ్‌ బకాయిలు రూ.1.86 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో రూ.1,78,400 కోట్లు ఏజీఆర్‌, స్పెక్ట్రమ్‌ చార్జీలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెల్లించాలి. వచ్చే ఏడాది ఏప్రిల్‌లోగా చెల్లించాల్సిన రూ.8,200 కోట్ల స్పెక్ట్రమ్‌ చార్జీల చెల్లింపు గడువు మరో ఏడాది పొడిగించాలని వొడాఫోన్‌ ఐడియా ఇప్పటికే కేంద్ర టెలికాం శాఖను కోరింది. వచ్చే మార్చిలో చెల్లించాల్సిన రూ.8,000 కోట్ల ఏజీఆర్‌ బకాయిలపైనా సుప్రీంకోర్టు ఊరటనిస్తుందని ఆశగా ఎదురు చూస్తోంది.
undefined

Latest Videos


ఈ ఆర్థిక కష్టాల నుంచి బయట పడేందుకు కంపెనీ మళ్లీ కొత్త అప్పుల కోసం చూస్తోంది. రూ.25,000 కోట్ల రుణ సేకరణకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు గత ఏడాది సెప్టెంబరులో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కంపెనీ ఆర్థిక కష్టాలు చూసి ఒక్క రుణదాత కూడా ఇప్పటి వరకు ముందుకు రాలేదు. కొన్ని అమెరికా టెలికాం సంస్థలకు ఈక్విటీ షేర్లు అమ్మేందుకు ప్రయత్నించినా కొనేందుకు ఎవరు ఆసక్తి చూపలేదని సమాచారం.
undefined
మరోపక్క వొడాఫోన్‌ ఐడియా ఆర్థిక కష్టాలు కంపెనీ ఆడిటర్లకూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కష్టాల నుంచి కంపెనీ గట్కెక్కుతుందా ? లేక మునుగుతుందా ? అని మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాల ఆడిటింగ్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వొడాఫోన్‌ ఐడియా మనుగడపై మరిన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
undefined
కొన్ని సంవత్సరాల క్రితం భారత టెలికాం మార్కెట్లో దాదాపు 12 కంపెనీలు ఉండేవి. 2016లో రిలయన్స్‌ జియో ప్రవేశంతో ఇందులో ఎనిమిది కంపెనీలు మూతపడటం, విలీనాల చేపట్టాయి. ప్రస్తుతం నాలుగు కంపెనీలు మాత్రమే ఉన్నాయి అందులో వొడాఫోన్‌ ఐడియా, బీఎ్‌సఎన్‌ఎల్‌ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దీంతో అనిల్‌ అంబానీ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌.కామ్‌) లాగానే వొడాఫోన్‌ ఐడియా మూతపడుతుందేమో అని మార్కెట్ వర్గాల అంచనా.
undefined
టెలికాం పరిశ్రమ ఆర్థిక పరిస్తితిపై భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. టెలికాం పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉందన్నారు. కనీస లాభాలు రావాలంటే టెలికాం సేవల చార్జీలు పెంచక తప్పదన్నారు. దేశ టెలికాం రంగంలో కనీసం మూడు కంపెనీలన్నా ఉండాలన్నారు. లేదంటే ప్రభుత్వ డిజిటల్‌ కల సాకారం కావడం కష్టమన్నారు. పరిశ్రమ మొత్తంగా చూస్తే ఆర్థిక కష్టాల్లో ఉన్నా ఎయిర్‌టెల్‌ ఆర్థిక పరిస్థితి మాత్రం ధృడంగానే ఉందని మిట్టల్‌ చెప్పారు. నిధుల సమీకరణ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాం. ఇందుకోసం ఇప్పటికే కొంతమంది ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి.
undefined
click me!