రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ట్విట్టర్ పెద్ద ప్రకటన.. ఈ ప్రత్యేక సర్వీస్ ఎంటో తెలుసుకోండి

First Published Jan 15, 2022, 10:01 AM IST

ప్రముఖుల నుండి సెలెబ్రిటిల వరకు అలాగే ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి, వ్యక్తపర్చడానికి  తరచుగా ట్విట్టర్‌ (Twitter) ఉపయోగిస్తుంటారు. అలాగే భారతదేశంలోని చాలా మంది ప్రజలు రాజకీయాల(politics) గురించి తమ అభిప్రాయాలను కూడా ట్విట్టర్‌లో పంచుకుంటుంటారు. 

దీన్ని దృష్టిలో ఉంచుకుని ట్విట్టర్  వినియోగదారులకు ఇంకా సాధారణ ప్రజాలకు సహాయం చేయడానికి  ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఫిబ్రవరి 10 నుంచి దేశంలోని  5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఓటు వేయడానికి ముందు పౌరులకు సరైన జ్ఞానంతో సాధికారత కల్పించడానికి ట్విట్టర్ గురువారం పలు కార్యక్రమాలను ప్రకటించింది. ఎన్నికల సమయంలో ప్రజలు విశ్వసనీయ సమాచారం కోసం అభ్యర్థులు అలాగే వారి మ్యానిఫెస్టోల గురించి ఆరా తీయడానికి ఇంకా చర్చలు, సంభాషణలలో పాల్గొనడానికి ట్విట్టర్‌ను ఆశ్రయిస్తారని ట్విట్టర్ ఒక ప్రకటనలో తెలిపింది. ట్విట్టర్ పబ్లిక్ ఇంటరాక్షన్ కోసం ఒక సేవగా ప్రజలు పౌర హక్కుల కింద సరైన నిర్ణయాలు తీసుకునేలా చేయడానికి కట్టుబడి ఉంది.

ట్విట్టర్‌  పోలింగ్‌ను నిర్ధారించడంపై మాత్రమే కాకుండా మొత్తం ఎన్నికలలో ఓటర్లు పాల్గొనెల అలాగే ఈ కాలంలో పూర్తి ఇంకా ఖచ్చితమైన సమాచారాన్ని కలిగి ఉండేలా చూసుకోవడంపై దృష్టి సారించింది. ఇది మాత్రమే కాదు, ఓటర్లకు సహాయం చేయడానికి ట్విట్టర్ ప్రత్యేక ఎమోజీని కూడా ప్రారంభించబోతోంది. 

అంతే కాకుండా ఓటర్ క్విజ్ ద్వారా ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను ప్రజలకు తెలియజేస్తామని ట్విట్టర్ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన విశ్వసనీయమైన ఇంకా అధికారిక సమాచారం కోసం భారత ఎన్నికల సంఘం అండ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారులతో ట్విట్టర్ 'సెర్చ్ ప్రాంప్ట్'ను కూడా ప్రారంభించింది.
 

ఇప్పుడు ఈ 'సెర్చ్ ప్రాంప్ట్' ట్విట్టర్  ఎక్స్‌ప్లోర్ పేజీలో సంబంధిత కీలక పదాలతో శోధించినప్పుడు విశ్వసనీయమైన ఇంకా అధికారిక సమాచారాన్ని అందిస్తుంది. పోలింగ్ తేదీలు, అభ్యర్థుల జాబితాలు, పోలింగ్ స్టేషన్‌లు అలాగే మరిన్నింటి గురించి మీరు ఖచ్చితమైన సమాచారాన్ని పొందగల సోర్సెస్ కి కూడా  మిమ్మల్ని తీసుకెళ్తుంది. 

విశేషమేమిటంటే ఇప్పుడు ఈ 'సెర్చ్ ప్రాంప్ట్' ఇంగ్లీషుతో పాటు హిందీ, పంజాబీ, కొంకణి భాషల్లో అందుబాటులోకి రానుంది. అలాగే చాలా హ్యాష్‌ట్యాగ్‌లు కూడా ఉంటాయి. అదనంగా, ట్విట్టర్ ఈ ఐదు రాష్ట్రాల్లో  వర్క్‌షాప్‌లు ఇంకా శిక్షణా సమావేశాలను నిర్వహించనుంది. ఎన్నికలకు సంబంధించి వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని పరిష్కరించడం దీని ముఖ్య లక్ష్యం.

click me!