సోషల్ మీడియా మార్గదర్శకాలు: రేపటి నుండి ఇండియాలో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ క్లోజ్..?

First Published | May 25, 2021, 1:41 PM IST

భారతదేశంలోని సోషల్ మీడియా యాప్స్  ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ సర్వీసులు నిలిచిపోనున్నాయ... తాజాగా దీనికి సంబంధించి సోషల్ మీడియా సంస్థలకు కొన్ని నిబంధనలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో ఆదేశించింది. 

ఇందుకు మూడు నెలల సమయం కూడా ఇచ్చింది, అయితే ఈ గడువు మే 26న పూర్తి కానుంది, కానీ ఇప్పటివరకు ఏ కంపెనీ కూడా ఈ నిబంధనలు పాటించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సంస్థలు మే 26 తర్వాత భారతదేశంలో మూసివేయబడతాయా అనే ప్రశ్న తలెత్తుతోంది…?
undefined
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 25 ఫిబ్రవరి 2021న అన్ని సోషల్ మీడియా సంస్థలకు కొత్త నిబంధనలను పాటించడానికి మూడు నెలల సమయం ఇచ్చింది. సోషల్ మీడియా సంస్థలను భారతదేశంలో కంప్లైయన్స్ ఆఫీసర్లు, నోడల్ ఆఫీసర్లను నియమించాలని కోరింది. అయితే కంప్లేయింట్ రిసోల్యూషన్, అభ్యంతరకరమైన కంటెంట్ పర్యవేక్షణ, కాంప్లియన్స్ రిపోర్ట్, అభ్యంతరకరమైన మేటిరియల్ తొలగించడం మొదలైన వాటికి నియమాలు ఉన్నాయి.
undefined

Latest Videos


సోషల్ మీడియా కంపెనీలు వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో ఫిజికల్ కాంటాక్ట్ వ్యక్తి గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కూ అనే భారతీయ సంస్థ తప్ప ఇతర ఏ సంస్థలలు ఎవరినీ నియమించలేదు.
undefined
అమెరికా నుండి గ్రీన్ సిగ్నల్…సోషల్ మీడియాలో ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు అలాగే వారి సమస్య ఎక్కడ, ఏ విధంగా పరిష్కరించబడుతుందో తెలియదు. కొన్ని ప్లాట్‌ఫాంలు దీని కోసం ఆరు నెలల సమయం కోరింది. మరి కొన్ని యు.ఎస్ లోని తమ ప్రధాన కార్యాలయం నుండి సూచనల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఈ కంపెనీలు భారతదేశంలో పనిచేస్తు, భారతదేశం నుండి లాభాలను ఆర్జిస్తున్నాయి, కానీ ప్రధాన కార్యాలయం నుండి గ్రీన్ సిగ్నల్ మార్గదర్శకాలను అనుసరించే వరకు వేచి ఉండాల్సి వస్తుంది. ట్విట్టర్ వంటి సంస్థలు సొంత ఫాక్ట్ చెకర్లను నిర్వహిస్తాయి, ఇవి వాస్తవాలను ఎలా దర్యాప్తు చేస్తున్నాయో వెల్లడించవు.
undefined
రేపటి నుండి కొత్త నిబంధనలు ఐటి చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం వారికి మధ్యవర్తిగా బాధ్యత నుండి మినహాయింపు ఉంటుంది, కాని వీటిలో చాలా వరకు భారత రాజ్యాంగం, చట్టాలను పట్టించుకోకుండా నిర్ణయం తీసుకుంటున్నాయి. కొత్త నిబంధనలు 2021 మే 26 నుండి అమల్లోకి రానున్నాయి. ఈ కంపెనీలు ఈ నిబంధనలను పాటించకపోతే, వారి మధ్యవర్తిత్వ స్థితిని తొలగించవచ్చు అలాగే ప్రస్తుతం ఉన్న భారతదేశ చట్టాల ప్రకారం క్రిమినల్ చర్యలకు లోనవుతాయి.
undefined
click me!