ఒక రకంగా వైల్డ్ కార్డ్స్ ఈ సీజన్ కి ఊపిరి పోశారు అని చెప్పొచ్చు. ఇక ఈసీజన్ లో టాస్క్ లు అంత ఎఫెక్టీవ్ గా ఆడకపోయినా.. తన ఒరిజినల్ క్యారెక్టర్ ఇది అని నిరూపించి ఆడియన్స్ మనసు దొచుకున్న కంటెస్టెంట్ విష్ణు ప్రియ. ఎవరికోసం తనను తాను మార్చుకోను అని.. తాను ఎలా ఉండాలో అలానే ఉంటానంటూ.. ప్రతీ వారం నామినేషన్స్ లోకి వస్తూ.. సేవ్ అవ్వుతూ వచ్చింది విష్ణు.
వచ్చిన వారం నుంచి 14వ వారం వరకు తన మనస్తత్వం పై ఎలాంటి మాస్క్ వెయ్యకుండా, తనకి ఏదైతే అనిపించిందో అది చేసుకుంటూ పోయింది. కొన్ని సార్లు విష్ణు ప్రియ చేస్తున్న పని అదరికి కోపం తెప్పించినా.. ఆమెలో నిజాయితీ అందరిని ఇప్రెస్ చేసింది. అయితే చివరి వారం ఆమెఎలిమినేట్ అవ్వడంతో.. విష్ణు ఫ్యాన్స్ కాస్త డిస్సపాయింట్ అయ్యారు.