కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ప్రారంభం అయింది. విజేత ఎవరు అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. ప్రేరణ, నిఖిల్, గౌతమ్, నబీల్, అవినాష్ ఫైనల్ కి చేరుకున్నారు. అయితే వీరిలో టైటిల్ బరిలో ముందున్నది మాత్రం గౌతమ్, నిఖిల్ ఇద్దరే. వీరిద్దరిలో విజేత ఎవరనే సస్పెన్స్ కి నాగార్జున తెర దించనున్నారు. అయితే విజేత ఎవరనేది ముందుగానే తెలిసిపోయింది. నిఖిల్ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్నారు.
బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేకి రాంచరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగార్జున బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని చరణ్ కి పరిచయం చేశారు. గంగవ్వని పరిచయం చేయగానే.. ఆమెని గేమ్ ఛేంజర్ సెట్స్ లో తొలిసారి కలిశాను. నాతో కలసి నటించారు. నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టేశారు. మీ డ్యూటీ మీరు సరిగ్గా చెయ్యట్లేదు అని తిట్టే పెద్దావిడ పాత్రలో గంగవ్వ నటించినట్లు రాంచరణ్ తెలిపారు.
ఆ తర్వాత నాగార్జున రోహిణిని పరిచయం చేయగా.. తాను కూడా గేమ్ ఛేంజర్ లో నటించినట్లు తెలిపారు. ఆ తర్వాత అవినాష్ మెగాస్టార్ చిరంజీవిని మిమిక్రీ చేస్తూ కొన్ని డైలాగ్స్ చెప్పారు. అదే విధంగా రాజశేఖర్ ని కూడా మిమిక్రీ చేశారు. అవినాష్ ట్యాలెంట్ కి రాంచరణ్ ఫిదా అయ్యారు.
నాగార్జునతో రాంచరణ్ గేమ్ ఛేంజర్ ముచ్చట్లు రివీల్ చేశారు. రాజమౌళి గారి ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఎలాంటి మూవీ చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో శంకర్ గారి సినిమాలో నటించే ఛాన్స్ రావడం తన అదృష్టం అని రాంచరణ్ తెలిపారు. శంకర్ ఓల్డ్ స్టైల్ పొలిటికల్ డ్రామా, ఎంటర్టైన్మెంట్ గేమ్ ఛేంజర్ లో ఉంటాయని రాంచరణ్ తెలిపారు.