కాబోయే భర్తతో పివి సింధు ... స్వయంగా ఎంగేజ్మెంట్ ఫోటో షేర్, పోస్ట్ వైరల్

Published : Dec 14, 2024, 05:12 PM ISTUpdated : Dec 14, 2024, 05:30 PM IST
కాబోయే భర్తతో పివి సింధు ... స్వయంగా ఎంగేజ్మెంట్ ఫోటో షేర్, పోస్ట్ వైరల్

సారాంశం

తెలుగు బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు నిశ్చితార్థం జరిగింది. ఈ ఫోటోలను స్వయంగా సింధు పోస్ట్ చేసారు. 

భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. తాజాగా తనకు కాబోయే భర్త వెంకట దత్తసాయితో పివి సింధు ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇవాళ (డిసెంబర్ 14) నిశ్చితార్థం జరగ్గా ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు పివి సిధు. 

 

తన ఎంగేజ్మెంట్ కు సంబంధించిన  ఓ ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఓ ఆసక్తికర క్యాప్షన్ జతచేసారు. 'ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు మనం కూడా తిరిగి ప్రేమించాలి. ఎందుకంటే ప్రేమ తనంతట తాను ఏమీ ఇవ్వదు' అంటూ మనసుకు హత్తుకునేలా వ్యాఖ్యలు చేసారు. 

పివి సింధు‌-దత్తసాయి వివాహం రాజస్థాన్ లో జరగనుంది. ఈ నెల అంటే డిసెంబర్ 22న ఉదయ్ పూర్ ప్యాలస్ అట్టహాసంగా పెళ్లి వేడుక జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్ 24న  హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటుచేసారు. పెళ్లి వేడుకలు డిసెంబర్ 20 నుండే ప్రారంభం కానున్నాయి. 


  
 

PREV
click me!

Recommended Stories

IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే
IND vs SA: హార్దిక్ పాండ్యా ఊచకోత.. 16 బంతుల్లోనే ఫిఫ్టీ, బద్దలైన రికార్డులు ఇవే!