సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఉసేన్ బోల్ట్ కవలపిల్లలు..

First Published Jun 21, 2021, 1:28 PM IST

ఆల్ టైమ్ ఒలింపిక్ గ్రేట్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఫాదర్స్ డే సందర్భంగా తన కవల పిల్లల ఫొటోను షేర్ చేశారు. ఇన్ స్ట్రా గ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫ్యామిలీ ఫొటోలో భార్య, కూతురితో సహా తన కవలలతో కలిపి ఉసేన్ బోల్ట్ ఉన్నారు.

ఆల్ టైమ్ ఒలింపిక్ గ్రేట్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఫాదర్స్ డే సందర్భంగా తన కవల పిల్లల ఫొటోను షేర్ చేశారు. ఇన్ స్ట్రా గ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫ్యామిలీ ఫొటోలో భార్య, కూతురితో సహా తన కవలలతో కలిపి ఉసేన్ బోల్ట్ ఉన్నారు.ఉసేన్ బోల్ట్ తన పిల్లల పేర్ల ప్రక్కన ఒక లైటనింగ్ బోల్ట్ ఎమోజీని చూపిస్తూ ఫాదర్స్ డే ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశారు. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఉసేన్ బోల్ట్‌ ట్విన్ బాయ్స్ పేర్లు సోషల్ మీడియాలో ఇప్పుడు తుఫానుగా మారాయి.
undefined
ఆల్ టైమ్ ఒలింపిక్ గ్రేట్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ అతని భార్య కాసి బెన్నెట్ ఆదివారం కవల అబ్బాయిలు పుట్టిన విషయాన్ని ఇలా ప్రకటించారు. వీరికి థండర్ బోల్ట్, సెయింట్ లియో బోల్ట్ అని పేరు పెట్టారు.ఈ ఫాదర్స్ డే ఫ్యామిలీ ఫోటోతో బోల్ట్ సోషల్ మీడియాలో వార్తను ప్రకటించారు. కవలలు ఎప్పుడు పుట్టారో చెప్పకుండా, క్యాప్షన్‌లో తన పిల్లల పేర్ల పక్కన ఒక లైటెనింగ్ బోల్ట్ ఎమోజీని పెట్టారు. కవలలు, కుమార్తె ఒలింపియా లైటెనింగ్ బోల్ట్‌తో కలిసి దంపతులు నడుస్తున్న ఓ చిన్న షాట్ ను కూడా షేర్ చేసుకున్నారు.
undefined
భార్య బెన్నెట్.. ఈ ఫొటోలను పంచుకుంటూ... ‘నా ప్రేమైక మూర్తికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు, ఈ కుటుంబానికి నువ్వే కొండంత బలం, నా పిల్లలకు గ్రేట్ డాడ్.. ఎల్లలు లేకుండా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం’ అంటూ ఉసేన్ బోల్డ్ ను ట్యాగ్ చేశారు.
undefined
ఒలింపియా లైటెనింగ్ 2020 మేలో జన్మించింది. అయితే ఆమె పేరును, ఆమె పుట్టిన కరెండు నెలల తరువాత ప్రకటించారు. బోల్ట్ ఫ్యామిలీ ఫొటో పోస్ట్ చేయడంతో ట్విట్టర్ ఒక్కసారిగా ప్రింజీ అయ్యింది.
undefined
2008, 2012 మరియు 2016 క్రీడలలో ఎనిమిది బంగారు పతకాలు సాధించిన 34 ఏళ్ల బోల్ట్, 2017 లో పదవీ విరమణ చేశారు. కోవిడ్ కారణంగా ఒలింపిక్స్ వాయిదా పడడంతో వచ్చేనెలలో టోక్యోలో జరిగే ఒలింపిక్స్ లో బోల్ట్ పాల్గొనడం లేదు.చరిత్రలో అత్యంత వేగంగా పరిగెత్తే స్పింటర్ గా బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లు ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. వరుసగా మూడు ఒలింపిక్స్‌లో 100 మీ, 200 మీ డబుల్ గెలిచిన ఏకైక స్ప్రింటర్ బోల్ట్.
undefined
తన కెరీర్‌లో 23 మేజర్ ఛాంపియన్‌షిప్ స్వర్ణాలు గెలుచుకున్న బోల్ట్, తన ట్రాక్ కెరీర్ ముగిసిన తర్వాత ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ వైపుకు వెళ్లడానికి ప్రయత్నించాడు, కాని కాంట్రాక్టును పొందలేకపోయాడు. దీంతో 2019 లో అన్ని క్రీడల నుండి రిటైర్ అయ్యాడు."ఇది మంచి అనుభవం. నేను జట్టులో ఉండటం చాలా ఆనందించాను, ఇది ట్రాక్, ఫీల్డ్ నుండి భిన్నంగా ఉండాలి. ఇది కొనసాగేటప్పుడు సరదాగా ఉంటుంది" అని అతను ఆ సమయంలో చెప్పాడు.
undefined
click me!