టోక్యో ఒలింపిక్స్: పీవీ సింధుకి మరో ఈజీ విక్టరీ... వరుసగా రెండో మ్యాచ్‌లో...

First Published | Jul 28, 2021, 8:27 AM IST

టోక్యో ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. అనుకున్నట్టుగానే తొలి రెండు రౌండ్స్‌లో పీవీ సింధుకి విజయాలు దక్కాయి. 

హంకాంగ్‌కి చెందిన చెంగ్ నాన్ లీతో జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను 21-9 తేడాతో సొంతం చేసుకుంది పీవీ సింధు. అయితే రెండో సెట్‌లో చెంగ్ నాన్ లీ, అద్వితీయ పోరాటాన్ని చూపించింది.
చెంగ్ నాన్ లీ అద్భుతమైన పోరాటంతో పాటు పీవీ సింధు చేసిన పొరపాట్ల కారణంగా ఒకానొక దశలో 14-14 స్కోర్లతో మంచి ఇంట్రెస్టింగ్ ఫైట్ నడిచింది.

ఆ తర్వాత పీవీ సింధు ఎట్టకేలకు కమ్‌బ్యాక్ ఇచ్చిన పీవీ సింధు 21-16 తేడాతో గెలిచి... వరుసగా రెండు సెట్లను గెలిచి, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో పీవీ సింధు, రౌండ్ 16కి అర్హత సాధించింది.
అంతకుముందు పూల్‌ ఏలో జరిగిన గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా హాకీ జట్టు 1-4 తేడాతో ఓడింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ జట్టుకి ఇది వరుసగా మూడో ఓటమి.
ఆర్చరీలో ఎట్టకేలకు ఓ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. భారత ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్, పురుషుల వ్యక్తిగత ఎలమినేషన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఉక్రెయిన్‌కి చెందిన ఓలెసి హన్‌బిన్‌పై 6-4 తేడాతో విజయాన్ని అందుకుని, ముందుకు దూసుకెళ్లాడు.
రోయింగ్‌ సెమీస్‌లో మెన్స్ డబుల్ స్కల్స్ ఈవెంట్‌లో భారత ప్లేయర్లు అర్జున్ లాల్, అర్వింద్ సింగ్ ఆరో స్థానంలో నిలిచి, ఫైనల్స్‌కి అర్హత సాధించలేకపోయారు. రోయింగ్‌లో భారత జట్టు సెమీస్‌లోకి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Latest Videos

click me!