వివాహబంధంతో ఒక్కటైన  అతియా శెట్టి, కెఎల్ రాహుల్‌.. నెట్టింట్లో ఫోటోలు వైరల్..

First Published Jan 23, 2023, 11:46 PM IST

KL రాహుల్ అతియా శెట్టి వివాహం: భారత క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ మరియు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ KL రాహుల్ , బాలీవుడ్ నటి అతియా శెట్టి వివాహం చేసుకున్నారు. ఇద్దరూ చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. రాహుల్, అతియా వివాహానికి చాలా సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి.

KL Rahul

టీమిండియా స్టార్ ఓపెనర్  కే.ఎల్. రాహుల్, సునీల్ శెట్టి కుమార్తె, బాలీవుడ్ నటి అతియా శెట్టిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

గత మూడేండ్లుగా ప్రేమించుకుంటూ ఈ జంటవివాహబంధంతో ఒక్కటైంది. ఖాండాలోని సునీల్ శెట్టి ఫాంహౌస్‌లో వీరి వివాహ వేదికగా మారింది

వీరి పెళ్లికీ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా, మెంటర్ గౌతమ్ గంభీర్, ఫాస్ట్ బౌలర్ వరుణ్ అరోన్, ఇషాంత్ శర్మతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు వీరి వివాహానికి హాజరయ్యారు.

అయితే.. న్యూజిలాండ్ సిరీస్ కారణంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వంటి క్రికెటర్లు వివాహానికి హాజరు కాలేపోయారు.

KL Rahul

అదే సమయంలో బాలీవుడ్ తార తళుకుమని మెరిసారు. ఈ వివాహ వైభవానికి  బాలీవుడ్ సెలబ్రిటీస్ డయానా పెంటీ, క్రిష్ణ ష్రాఫ్, అన్షులా కపూర్ తదితరులు హాజరయ్యారు.

KL Rahul

ఈ  వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను రాహుల్, అతియాలు తమతమ సోషల్ మీడియా వేదికలో పోస్టు చేశారు.  తమ అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ముగిసిన తరువాత భారీ ఎత్తున రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. మే లేదా జూన్‌లో కార్యక్రమం జరిగే అవకాశముంది.

click me!