రీసెంట్ గా గాలా ఈవెంట్ 2024 జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో చాలా మంది ముద్దు గొమ్మలు మెరిశారు. అలా మెరిసిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా ఉంది. ఈ ఈవెంట్ లో అలియా భట్ చక్కగా చీరలో కనిపించారు. చీరలో ఆమె లుక్ కి అందరూ ఇంప్రెస్ అయిపోయారు.
ఈక్రమంలో ఆ చీర హాట్ టాపిక్ గా మారింది. పిస్తా గ్రీన్ కలర్, గ్రే కలర్ కాంబినేషన్ లో ఉన్న ఫ్లోరల్ చీర చాలా మంది చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది. దానికి అలియా ప్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించగా.. అందులో ఆమె చాలా అందంగా కనిపిస్తున్నారు.
Alia Bhatt
అయితే ఇది మామూలు చీర అయితే కాదు. ఈ చీరను డిజైన్ చేయడానికి దాదాపు 163 ఆర్టిస్టులు పని చేశారట. చీర మొత్తం ఎంబ్రాయిడరీ చేయడానికి 163 మంది కష్టపడగా... వారికి దాదాపు 1905 రోజుల సమయం పట్టింది. ఈ చీరను సభ్యసాచి ముఖర్జీ డిజైన్ చేశారు.
ఈసారి మెట్ గాలా థీమ్ 'ది గార్డెన్ ఆఫ్ టైమ్'. కాలానికి అతీతంగా ఉండాలి. అందుకే.. అలియా భట్ ఈ ఈవెంట్ కోసం చీరను ఎంచుకుంది. ఆ చీర కూడా స్పెషల్ గా డిజైన్ చేయించుకోవడంతో.. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
మెట్ గాలాలో అలియా లుక్ చాలా మంది ఫ్యాషన్‌వాదులు , ఫోటోగ్రాఫర్‌ల దృష్టిని ఆకర్షించింది. సందర్భం ఏదైనా సరే, చీర ఎలాంటి ఫ్యాషన్‌కైనా కీలకమని మరోసారి రుజువు చేసింది. మరి ఈ చీరలో అలియా లుక్ మీకు ఎలా అనిపించింది..?