టోక్యోలో ఎమర్జెన్సీ విధింపు... ఒలింపిక్స్‌కి ముందు అథ్లెట్స్‌లో ఆందోళన...

First Published Jul 8, 2021, 5:04 PM IST

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్, ఈ ఏడాది కూడా సజావుగా సాగడం అనుమానంగానే మారింది. జపాన్ రాజధాని టోక్యోలో మళ్లీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో మరోసారి ఎమర్జెన్సీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం...

విశ్వక్రీడల ప్రారంభానికి రెండు వారాల ముందుఎమర్జెన్సీ విధించడంతో ఆంక్షల మధ్యేఒలింపిక్స్‌ క్రీడలు, కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాల మధ్య జరగబోతున్నాయి. ఒలింపిక్స్ ముగిసేదాకా ఈ ఎమర్జెన్సీ అమలులో ఉంటుంది.
undefined
ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం ప్రపంచ నలుమూలల నుంచి అథ్లెట్స్, టోక్యోకి చేరుకుంటున్నారు. వీరికి అవసరమైన సదుపాయాల కల్పన, ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్న జపాన్ ప్రభుత్వానికి, కరోనా కేసులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి...
undefined
విశ్వక్రీడల్లో పతకం నెగ్గడాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు అథ్లెట్స్. ఒలింపిక్స్‌లో మెడల్ సాధించడంటే చాలా పెద్ద అఛీవ్‌మెంట్‌గా భావిస్తాయి ప్రపంచదేశాలు.
undefined
ఇలాంటి క్రీడా పోటీలు, ఈసారి కరోనా వైరస్ కారణంగా బిక్కుబిక్కుమంటూ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కరోనా కేసులు లేకుండా ఒలింపిక్స్‌ను విజయవంతంగా పూర్తి చేయలేమని ఒలింపిక్స్ ఆర్గనైజేషన్ కమిటీ కామెంట్ చేయడం విశేషం..
undefined
ఇప్పటికే బయో బబుల్‌లో గడుపుతున్న భారత అథ్లెట్స్, ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ నుంచి వచ్చే క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 17న మొదటి బ్యాచ్‌ను టోక్యోకి పంపనుంది భారత ఒలింపిక్ అసోసియేషన్...
undefined
ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మెడల్స్ విషయంలో సింగిల్ డిజిట్ మార్కు కూడా దాటలేకపోయిన భారత్, ఈసారి ఆ ఫీట్ సాధించాలని కసిగా ఉంది... ఒలింపిక్ పతకం గెలిస్తే కాసుల వర్షం కురిపిస్తామని ఇప్పటికే రాష్ట్ర, కేంద్రప్రభుత్వాల నుంచి ప్రకటనలు కూడా వచ్చాయి...
undefined
ఈ నెల 23న ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్, వచ్చే నెల 8వ తేదీ వరకూ జరుగుతాయి. ఇందులో 339 క్రీడా పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 206 దేశాల నుంచి 11,091 మంది అథ్లెట్స్ పాల్గొనబోతున్నారని అంచనా. వీరి సహాయక సిబ్బందితో కలిపి దాదాపు 30 వేల మంది కోసం స్పోర్ట్స్ విలేజ్‌లో ఏర్పాట్లు చేసింది జపాన్.
undefined
click me!