దీపక్ పూనియా ఓటమి తర్వాత రిఫరీ రూమ్‌కెళ్లి... భారత రెజ్లర్ కోచ్‌పై వేటు....

First Published | Aug 6, 2021, 3:32 PM IST

భారత రెజ్లర్ దీపక్ పూనియా, కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడిన విషయం తెలిసిందే... అయితే ఈ మ్యాచ్‌లో రిఫరీల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసి, రిఫరీల గొడవ పడిన అతని కోచ్, స్పోర్ట్స్ విలేజ్ నుంచి బహిష్కరణకు గురయ్యాడు.. 

86 కేజీల విభాగంలో శాన్ మెరినోకి చెందిన మౌలెస్ అమైన్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపిక్ పూనియా 2-3 తేడాతో ఓడాడు.. 

ఆఖరి 10 సెకన్ల వరకూ ఆధిక్యంలో ఉన్న దీపక్ పూనియా, ఆఖర్లో ప్రత్యర్థికి పాయింట్ల అప్పగించి ఓటమి పాలయ్యాడు. అయితే ఈ నిర్ణయంపై భారత రెజ్లర్ కోచ్ మరోద్ గైద్రోవ్ అసంతృప్తి వ్యక్తం చేసి, ఛాలెంజ్ కూడా చేశాడు.

Latest Videos


దీపక్ పూనియా డిఫెన్స్‌లో ఉన్నప్పుడే సమయం ముగిసినా రిఫరీ దాన్ని గమనించకుండా ప్రత్యర్థికి పాయింట్లు అప్పగించాడనేది మరోద్ గైద్రోవ్ ఆరోపణ. అయితే భారత రెజ్లింగ్ కోచ్ తీసుకున్న ఛాలెంజ్‌ను రిఫరీ బోర్డు తిరస్కరించింది...

అయితే ఈ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తి గురైన దీపక్ పూనియా ఫారిన్ కోచ్ మరోద్ గైద్రోవ్... మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా కోపం చల్లారక రిఫరీల రూమ్‌కి వెళ్లి, ఆ ఫైట్‌కి రిఫరీగా వ్యవహరించిన అధికారిని బూతులు తిట్టడమే కాకుండా, చేయి చేసుకున్నాడట...

ఈ హఠాత్ సంఘటనతో దీపక్ పూనియా కోచ్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన ఒలింపిక్ కమిటీ, అతన్ని స్పోర్ట్స్ విలేజ్ నుంచి బహిష్కరించింది... 23 ఏళ్ల దీపక్ పూనియా, తన మొదటి ఒలింపిక్స్‌లోనే మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. 

click me!