అందరి టార్గెట్‌ ఒక్కడే, బిగ్‌ బాస్‌ తెలుగు 8 నామినేషన్‌లో ఎవరున్నారంటే?

First Published | Nov 25, 2024, 11:35 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8.. 13వ వారం నామినేషన్‌ ప్రక్రియ హాట్‌ హాట్‌ గా సాగింది. అయితే ఈ వారం ఎలిమినేట్ కావడానికి ఎంత మంది నామినేట్‌ అయ్యారో తెలుసుకుందాం.  
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8.. 12 వారాలు పూర్తి చేసుకుంది. మరో మూడు వారాల్లో షో పూర్తి కానుంది. ఎనిమిదవ సీజన్‌ చాలా సాధాసీదాగా సాగిపోతుంది. అడపా దడపా రచ్చ జరుగుతుంది. కానీ చాలా వరకు కూల్‌గానే నడిచిపోతుంది. నామినేషన్ల ప్రక్రియ హార్డ్ గా సాగిల్సి ఉంది. వేడి వేడిగా సాగితేనే కిక్ ఉంటుంది. కానీ చాలా వరకు చాలా చప్పగా సాగుతుందని చెప్పొచ్చు. 
 

ఇదిలా ఉంటే 12వ వారంలో యష్మి ఎలిమినేట్‌ కాగా, 13వ వారానికి సంబంధించిన నామినేషన్‌ జరిగింది. సోమవారం ఎపిసోడ్‌లో ప్రధానంగా నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన చర్చనే జరిగింది. ఇందులో నబీల్‌.. గౌతమ్‌, విష్ణు ప్రియాలను నామినేట్‌ చేసిండు. ఒక్కో వారం ఒక్కోలా ఉంటావని, పక్షపాతం ధోరణితో ఉంటావని చెప్పడం నచ్చలేదని గౌతమ్‌ చెప్పిన విషయం నచ్చలేదన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గట్టి వాగ్వాదం జరిగింది. విష్ణు ప్రియా ఆటలో సీరియస్‌ నెస్‌ లేదని తెలిపారు. పృథ్వీతోనే ఉండటం కాదు, ఆట కూడా ఆడాలని తెలిపారు. 
 


పృథ్వీరాజ్‌.. అవినాష్‌, గౌతమ్‌లను నామినేట్‌ చేశాడు. అవినాష్‌ మెగాచీఫ్‌గా సరిగా చేయలేదని, గౌతమ్‌ ఏం పీకలేరు అంటూ బూతు పదాలు వాడటం నచ్చలేదని తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం గట్టిగానే సాగింది. ప్రేరణ.. విష్ణు ప్రియా, గౌతమ్‌లను నామినేట్‌ చేసింది. గౌతమ్‌ ప్లానింగ్‌ ప్రకారం ఆడతాడని, అలానే మాట్లాడతాడని తెలిపింది. తేజ.. విష్ణు ప్రియా, పృథ్వీరాజ్‌లను నామినేట్‌ చేసింది. పృథ్వీ వివరణ ఇచ్చేందుకు నో చెప్పడం నవ్వులు పూయించింది. విష్ణుప్రియా.. తేజ, ప్రేరణలను నామినేట్‌ చేసింది. ప్రేరణ బాడీ లాంగ్వేజ్‌ రూడ్‌గా ఉందని తెలిపింది విష్ణు ప్రియా. 
 

గౌతమ్‌.. నిఖిల్‌, ప్రేరణలను నామినేట్‌ చేశాడు. ఆడవాళ్లని హార్ష్‌ గా డీల్‌ చేయడాన్ని నో చెప్పారు. నిఖిల్‌ ని నామినేట్‌ చేసే దాంట్లో తేజ ఇన్‌వాల్వ్ కావడంతో పృథ్వీరాజ్‌ రియాక్ట్ అయ్యాడు. మధ్యలో డిఫెన్స్ లాయర్‌వా అంటూ అడగడంతో ఇద్దరి మధ్య గట్టి వాగ్వాదం జరిగింది. ఒకరిపైకి ఒకరు వెళ్లారు. ఒక్కసారిగా వాతావరణ హీటెక్కిపోయింది. అవినాష్‌.. పృథ్వీ, విష్ణు ప్రియాలను నామినేట్‌ చేవారు. మెగా చీఫ్‌గా తాను ఓ టాస్క్ లో కంట్రోల్‌ చేయలేదనే విషయాన్ని పృథ్వీ ప్రశ్నించడం పట్ల అవినాష్‌ తనకు నచ్చలేదన్నారు. విష్ణు ప్రియా ఎంటర్‌టైనర్లు అంటూ ఎగతాళి చేసినట్టు మాటడం నచ్చలేదని తెలిపారు అవినాష్‌. దీనికి ఆమె కూడా క్షమాపణలు తెలిపారు. 
 

నిఖిల్‌.. గౌతమ్‌, ప్రేరణలను నామినేట్‌ చేశాడు. అండర్‌ స్టాండింగ్‌ విషయంలో నెలకొన్న సందిగ్దాన్ని వెల్లడించారు. రోహిణి..విష్ణు ప్రియా, నబీల్‌ని నామినేట్‌ చేసింది. మొత్తంగా ఈరోజు ఎపిసోడ్‌లోకొంత ఫైరింగ్‌ పక్కన పెడితే సాఫీగానే సాగిందని చెప్పొచ్చు. ఇక మొత్తంగా 13వ వారం నామినేషన్‌కి సంబంధించి విష్ణు ప్రియా, గౌతమ్‌, నిఖిల్‌, అవినాష్‌, తేజ, ప్రేరణ ఇలా ఎనిమిది మంది నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది చూడాలి. 

Latest Videos

click me!