ఆమె చెబితే ఒప్పుకున్నారు, అదే మాట మేం చెప్పి ఉంటే... భారత రెజ్లర్ వినేష్ ఫోగట్...

First Published Aug 14, 2021, 3:30 PM IST

కచ్ఛితంగా ఒలింపిక్ పతకం తెస్తుందనే భారీ ఆశలతో టోక్యోలో అడుగుపెట్టింది భారత వుమెన్ రెజ్లర్ వినేష్ ఫోగట్. 53 కేజీల విభాగంలో పోటీపడిన వినేష్ ఫోగట్, క్వార్టర్ ఫైనల్‌లో ఓడి నిరాశపరిచింది. అయితే ఆమెపై రెజ్లింగ్ ఫెడరేషన్ తాత్కాలిక నిషేధం విధించడం, ఆ తర్వాత వినేశ్ ఫోగట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి...

టోక్యో ఒలింపిక్స్‌ 2020లో వినేష్ ఫోగట్ ప్రవర్తన హాట్ టాపిక్ అయ్యింది. కరోనా నిబంధనల కారణంగా స్పోర్ట్స్ విలేజ్‌లో అథ్లెట్లకు కేటాయించిన గదుల్లో వినేష్, తోటి రెజ్లర్లతో ఉండడానికి నిరాకరించింది. 

సెపరేట్ రూమ్ కావాలని డిమాండ్ చేయడమే కాకుండా సరిగ్గా ప్రాక్టీస్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదని... భారత క్రీడాకారుల అధికారిక స్పాన్సర్ కిట్‌ను ధరించడానికి కూడా ఆమె ఇష్టపడలేదనే ఆరోపణలతో వినేష్ ఫోగట్‌ను తాత్కాలికంగా నిషేధం విధించింది భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా...

2018 ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్... ‘నేను ఏదో కలలో ఉన్నానని నాకు అనిపిస్తోంది. ఏదీ ఇంకా మొదలు కానట్టు, నేనింకా బ్లాక్‌లోనే ఉన్నాను...
నా జీవితంలో ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు... గత వారం రోజులుగా ఏదేదో జరిగిపోతోంది. అవన్నీ నన్ను అంతర్గతంగా బాగా దెబ్బతీస్తున్నాయి... 

ఇది రెండు హృదయాల కథ, రెండు మనసుల కథ... రెజ్లింగ్ కోసం నేను, నా జీవితాన్ని మొత్తం అంకితం చేశాను. కానీ ఇప్పుడు రెజ్లింగ్ నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చిందనుకుంటా... రెజ్లింగ్‌ని మరిచిపోయి, సాధారణ మనిషిగా ప్రశాంత జీవితం గడపాలని అనుకుంటున్నా... 

అథ్లెట్లు ఎక్కడ తప్పు జరిగిందని అడగరు, ఎక్కడ తప్పు చేశామో చెబుతారు. నా విషయంలో నాకు తెలియకుండానే నా చుట్టూ ఎన్నో కథలు అల్లుకుపోతున్నాయి...

నేను బరువు పెరిగాను. నాకు ప్రత్యేకంగా ఫిజియో ఉన్నారు, నేను రెజ్లర్‌ని. నాకు షూటింగ్ టీమ్‌‌కి ఉండే ఫిజియోను అసైన్ చేశారు. ఆమె నా బాడీ గురించి ఎలా అర్థం చేసుకుంటుంది...
రెజ్లింగ్ ఆటకి కొన్ని ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయి. అవి ఆమె అర్థం చేసుకోలేదు. నేను రెండుసార్లు కరోనా బారిన పడి కోలుకున్నా. ఏడాది పాటు నా శరీరం నాకు సహకరించలేదు... 

ఆసియా ఛాంపియన్‌షిప్స్ కోసం ఖజకిస్తాన్ వెళ్లి వచ్చిన తర్వాత నేను మరోసారి ఆరోగ్యానికి గురయ్యాను... 
కరోనా నుంచి కోలుకుని బల్గేరియాకి వెళ్లా. ఆ తర్వాత కొన్నిరోజులకే నా కుటుంబం కరోనా బారిన పడింది. డిప్రెషన్, స్ట్రెస్... వాటితో పోరాడుతూనే ఉన్నాను...

సైమన్ బైల్స్ ఒలింపిక్స్ కోసం మానసికంగా సిద్ధం కాలేదని చెబితే, మనం ఆ నిర్ణయాన్ని స్వాగతించాం. ఓపెన్‌గా తన నిర్ణయాన్ని చెప్పిన తనని మెచ్చుకున్నాం... అదే మాట మేం చెబితే ఒప్పుకుంటారా... రెజ్లింగ్‌‌ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నా... మళ్లీ బరిలో దిగుతానో లేదో తెలీదు...’ అంటూ చెప్పుకొచ్చింది భారత రెజ్లర్ వినేష్ ఫోగట్..

click me!