ఈ సమయంలో భార్యభర్తలు కలిస్తే అశుభం.. ఎందుకో ఇక్కడ చదివి తెలుసుకోండి!

First Published Nov 2, 2021, 4:43 PM IST

వివాహం అనే పవిత్ర బంధంతో (Scared bond) ఇద్దరు మనుషులు ఒక్కటవుతారు. ఈ పవిత్ర బంధంలో వారి కలయిక మధురమైనది. అయితే కొన్ని సందర్భాలలో ఇద్దరి మధ్య కలయిక మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఆర్టికల్ (Article) ద్వారా ఏ సమయంలో భార్య భర్తలు కలవడం మంచిది కాదో తెలియచేయడమే ముఖ్య ఉద్దేశం.
 

భార్య భర్తల కలయిక ఒక పవిత్రమైనది. అయితే ఏ సమయంలో పడితే ఆ సమయంలో కలవరాదు అని  శాస్త్రాలు (Science) చెబుతున్నాయి. ముఖ్యంగా కొన్ని సందర్భాలలో వారు అసలు కలవరాదు. అలా కలిస్తే వారికి అరిష్టం కలుగుతుందని భావిస్తారు. కొందరు పెళ్లికి ముందే శృంగారంలో (Romance) పాల్గొంటారు.
 

వివాహానికి ముందే ఇలా చేయడం తప్పు అంతే కాకుండా వారికి సర్వపాపాలు (All sins) కలుగుతాయి. స్త్రీ పురుషుల కలయిక ఒక ప్రాణికి ఆయువు పోయడం వంటిది. వివాహం తరువాత జరిగే ఆ పవిత్ర కలయికకు ఒక ముహూర్తం (Muhurtam) అంటూ పెడతారు. ఇలా మంచి ముహూర్తంలో కలవడంతో వారి సంతానం  మంచిగా ఉంటుంది.
 

అయితే వివాహం తరువాత కూడా కొన్ని సందర్భాలలో శృంగారంలో (Romance) పాల్గొనరాదు. శాస్త్రాలకు విరుద్ధంగా (Contravention) పాల్గొంటే వారికి అరిష్టాలు, దరిద్రాలు, వివిధ రకాల ఆర్థిక నష్టాలు(Financial losses) కలుగుతాయి. అయితే ఏ సందర్భాలలో కలవరాదో తెలుసుకుందాం.
 

హిందువులు తమ మొదటి పండుగైనా శ్రీమహావిష్ణువును ఇష్టమైన తొలి ఏకాదశి రోజున పవిత్రంగా భావించి పూజలు చేస్తుంటారు. పూర్తిగా  మనసును శ్రీ మహావిష్ణువు మీద పెట్టి పూజలు చేస్తూ ఆయనను స్మరిస్తారు. అప్పుడు మీ సర్వపాపాలు (All sins) తొలగిపోయి పుణ్యఫలం లభిస్తుంది. అలా కాదని ఆ పవిత్రమైన రోజు శృంగారంలో (Romance) పాల్గొంటే ఆ స్వామి ఆగ్రహిస్తాడు.
 

ప్రతి నెల వచ్చే శివరాత్రి రోజున కలవరాదు. కలిస్తే ఆ పరమశివుని ఆగ్రహానికి (Anger) గురవుతారు. అలాగే శరన్నవరాత్రి తిథులను చాలా పవిత్రంగా భావించి వ్రతాలు చేస్తుంటారు. అమ్మవారికి తమ కోరికలు (Desires) తెలుపుతూ ఇంట్లో కలశాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తుంటారు. అలాంటి తిథులలో కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ భార్య భర్తలు కలవరాదు.
 

ఆ సమయంలో కలిస్తే అమ్మవారి కృప అనేది ఉండదు. మీరు చేసిన పూజలు వృధా అవుతాయి. పౌర్ణమి తిథులలో భార్య భర్తల కలయిక మంచిది కాదు. పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి అంకితం ఇస్తారు. రాత్రి సమయంలో మహాలక్ష్మిని (Mahalakshmi) పూజించడంతో ఇంటిలో ఆనందం, అష్టైశ్వర్యాలు (Ashtaishwaryas) పెరుగుతాయి అని భావిస్తారు.
 

ఆ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది. ఆ రోజు భార్య భర్తలు శారీరక బంధంలో పాల్గొనడం తప్పుగా పెద్దలు చెబుతారు. శాస్త్రాలను (Science) కాదని భార్య భర్తలు శారీరక బంధం లో పాల్గొంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. దాంతో అనేక ఆర్థిక నష్టాలు (Financial losses) ఏర్పడతాయి.
 

అమావాస్య తిథులలో భార్య భర్తలు కలవరాదు. ఇది వారి వైవాహిక జీవితానికి మంచిది కాదు.  అమావాస్య (Amavasya) రోజున ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ రాత్రి తాంత్రికుల రాత్రిగా భావిస్తారు. ఇంట్లో ఎవరైనా (Ancestral) మరణించిన రోజునకూడా కలవరాదు. అలా కాదని భార్య భర్తలు కలవడంతో పితృదేవతలు ఆగ్రహిస్తారు. దాంతో  సంతాన సమస్యలు వస్తాయి.

click me!