సెక్స్ లో పాల్గొనడం మానేస్తే ఏమౌతుందో తెలుసా?

First Published Jan 3, 2024, 2:06 PM IST

లైంగిక కార్యకలాపాలు స్త్రీ పురుషుల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. ఇది మీ శారీరక, మానసిక శ్రేయస్సుకు ఎంతో మేలు చేస్తుంది. మరి లైంగిక కార్యకాలాపాలను ఆపేసినప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

శృంగారం మీకు శారీరక ఆనందాన్ని కలిగించడమే కాకుండా.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మీ శరీరానికి ఆనందం కలిగినప్పుడు మనస్సు రిలాక్స్ అవుతుంది. లైంగిక కార్యకలాపాల వల్ల మనస్సుకు ఆనందం కలిగించే డోపామైన్ వంటి సంతోషకరమైన హార్మోన్లు విడుదల అవుతాయి. ఇది ఓదార్పు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శారీరక నొప్పి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా, ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. మరి సెక్స్ లో పాల్గొనడం మానేస్తే ఏమౌతుందో తెలుసుకుందాం పదండి.
 

Sex Life

తరచూ ఒత్తిడికి గురవుతారు

నిపుణుల ప్రకారం.. సెక్స్ ఒక పెద్ద ఒత్తిడి బస్టర్. ఇది ఎండార్ఫిన్లు, ఫీల్ గుడ్ న్యూరోట్రాన్స్మిటర్లు, డోపామైన్, సెరోటోనిన్ వంటి కొన్ని ఇతర హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. సెక్స్ సమయంలో విడుదలయ్యే హార్మోన్లు మీ మానసిక స్థితిని పెంచడానికి, మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి. భావప్రాప్తి సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ భావోద్వేగ ఆరోగ్యం, మీ సంబంధాలపై సానుకూల ప్రభావాలను చూపుతుంది. ఇక సెక్స్ ను ఆపేసినప్పుడు దంపతుల మధ్య దూరం, గొడవలు ఎక్కువగా జరుగుతుంటాయి. సంబంధాలను బలోపేతం చేయడానికి విడుదలయ్యే హార్మోన్లు ఇకపై మీ శరీరం ద్వారా విడుదల చేయబడవు. ఇది మీ జీవితాన్ని ఒత్తిడితో, మానసికంగా అలసిపోయేలా చేస్తుంది. 
 

రోగనిరోధక శక్తి

అవును సెక్స్ లో పాల్గొనడం వల్ల మీ శరీర రోగనిరోధక శక్తి స్థాయిలు పెరుగుతాయి. పెన్సిల్వేనియాలోని విల్కేస్-బారే యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం.. మీరు శృంగారంలో పాల్గొన్నప్పుడు మీ శరీరంలో ఇమ్యునోగ్లోబులిన్ ఎ అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇమ్యునోగ్లోబులిన్ ఎ వైరస్లతో పోరాడటానికి సహాయపడుతుంది. మీరు సెక్స్ లొ పాల్గొనడం ఆపేసినప్పుడు ఇమ్యునోగ్లోబులిన్ ఎ దాదాపు తక్కువగా విడుదల అవుతుంది. అలాగే దాని వల్ల మీరు ఫ్లూ, దగ్గు, సీజనల్ జ్వరం వంటి వ్యాధులకు గురవుతారని నిపుణులు చెబుతున్నారు. 
 

లైంగిక ప్రతిస్పందన మారుతుంది

ఏదైనా కారణం వల్ల మీరు సెక్స్ కు దూరంగా ఉంటే ఆటోమేటిక్ గా వారి సెక్స్ డ్రైవ్ తగ్గిపోతుందని పలు పరిశోధనల్లో తేలింది. ఇలాంటి వారు భావప్రాప్తిని చేరుకోలేరు. లేదా సెక్స్ కోసం కోరికలు కలగవు. 
 

మెదడు పనితీరు

సెక్స్ లో పాల్గొనప్పుడు లేదా భావప్రాప్తి పొందినప్పుడు.. న్యూరోట్రాన్స్మిటర్లు మీ మొత్తం మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మీ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది మీ దృష్టి, సృజనాత్మకత,ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది మీ జ్ఞాపకశక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. సెక్స్ మానేసినప్పుడు ఇవేవీ జరగవు.

click me!