సెక్స్ కోరికలు, ఆసక్తులు వ్యక్తి వ్యక్తికి మారొచ్చు. కొంతమంది తమ భాగస్వామితో మంచి లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటే.. మరికొంతమంది తమ భాగస్వామితో సన్నిహిత, సంబంధాన్ని మెరుగుపర్చుకోవడంలో ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తుంటారు. కొంతమంది పురుషులకు లైంగిక కోరికలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి వారు తమ భాగస్వామితో సెక్స్ లో పాల్గొనడానికి ఇష్టపడరు. అలసట, డిప్రెషన్, వయసు వంటి వివిధ కారణాల వల్లయ మధ్య వయస్కుల్లోనే సెక్స్ సమస్యలు వస్తాయి. అయితే మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే మీ సెక్స్ లైఫ్ ను మెరుగుపర్చుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే..?
హెల్తీ డైట్
సెక్స్ లైఫ్ ను మెరుగ్గా ఉంచడానికి కొన్ని రకాల ఆహారాలు కూడా ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం కామోద్దీపన, జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. ముఖ్యంగా అత్తి పండ్లు, అరటిపండ్లు, చాక్లెట్లు, వెన్న వంటివి తిన్నా మీ లైంగిక కోరికలు బాగా పెరుగుతాయి. అయితే కొన్ని రకాల ఆహారాలు మీ లిబిడోను బాగా తగ్గిస్తాయి. వేయించిన ఆహారాలు, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు లేదా స్వీట్లు మీ లైంగిక కోరికలను తగ్గిస్తాయి. లిబిడోను తగ్గిస్తాయి. అందుకే వీటికి బదులుగా చికెన్, గింజలు, పండ్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. ఇవి మీ కామోద్దీపనను మెరుగుపరచడానికి, హార్మోన్ల అసమతుల్యత సమస్యను పోగొట్టడానికి సహాయపడతాయి.
Image: Getty
తగినంత నిద్ర
నిద్రకూడా మీ లైంగిక జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. సరిగ్గా నిద్రపోకుంటే మీకు లైంగిక ఆసక్తి తగ్గుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి కలుగుతుంది. అంతేకాదు ఈ నిద్రలేమి సమస్య చాలా కాలంగా ఉంటే ఎన్నో అనారోగ్యసమస్యలు వస్తాయి. మీ సెక్స్ లైఫ్ కూడా బాగుండదు. అందుకే నిద్రలేమి సమస్యతో చాలా కాలంగా బాధపడేవారు డాక్టర్ కు చూపించుకోవడం మంచిది.
శారీరక ఆరోగ్యం
శారీరక దృఢత్వానికి లైంగిక కార్యకలాపాలకు సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. స్థూలకాయం, అధిక బరువు మీ సెక్స్ లైఫ్ ను నాశనం చేస్తాయి. అయినప్పటికీ చిన్న వ్యాయామం కూడా లైంగిక పనితీరుపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్ గా వ్యాయామం చేసేవారు శృంగారం లో చరుగ్గా ఉంటారని నిపుణులు అంటున్నారు. వ్యాయామం మన శరీరాన్ని ఆరోగ్యం, ఫిట్ గా ఉంచుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
భాగస్వామితో మాట్లాడటం
ఒత్తిడికి గురికావడం, ఆరోగ్య సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వల్లే సెక్స్ పట్ల కోరికలు బాగా తగ్గుతాయి. ఒకవేళ మీకు మీ భాగస్వామికి ఈ సమస్య ఉంటే దాని గురించి వారితో మాట్లాడండి. అవసరమైతే చికిత్సలు తీసుకోండి. మీ సంబంధంపై ఆసక్తిని పెంచడానికి కొత్త మార్గాలను ప్రయత్నించండి.