శృంగారం పట్ల ఆసక్తి ఉండనివారు ఎవరు ఉండరు చెప్పండి..? అయితే.. తొలిసారి సెక్స్ విషయంలో.. అమ్మాయిలు ఎలా కంగారుపడతారు అనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. దాదాపు శృంగారమంటే.. అబ్బాయిలు కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటి.. పురుషులు తొలిసారి సెక్స్ సమయంలో ఎలా ప్రవర్తిస్తారు. వారి ఆలోచనలు ఎలా ఉంటాయి అనే విషయం తెలుసుకుందామా..?
తొలిసారి సెక్స్ అనగానే.. ముందు అబ్బాయిలు.. తమ బెడ్రూమ్, బాత్రూమ్ క్లీన్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటారట. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజమట. తమ గడ్డం ట్రిమ్ చేసుకోవడం లేదంటే.. షేవ్ చేసుకోవడం లాంటివి చేసుకోవడం తోపాటు.. బాత్రూమ్ , టాయ్ లెట్ సీట్, బెడ్రూమ్ నీట్ గా ఉంచుతారట.
అంతేకాదు.. ఫస్ట్ టైమ్ కలయికలో పాల్గొంటున్నామనే ఆనందంతో.. దానిని ఎలాంటి పరిస్థితుల్లో స్పాయిల్ అవ్వకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారట. అందుకోసం ముందుగానే చెక్ లిస్ట్ ని ప్రిపేర్ చేసుకుంటారట. ఆ చెక్ లిస్ట్ ఆధారంగా అన్ని పనులను పూర్తి చేసుకుంటారట.
అంతేకాకుండా.. కండోమ్స్ ముందుగానే తెచ్చి ఉంచుకుంటారట. తొలిసారి కలయికతోనే గర్భం రావాలని కోరుకోరు కదా.. అందుకే.. వారు ముందుగానే కండోమ్స్ తెచ్చుకొని ఉంచుకుంటారట. ఈ విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని కోరుకుంటారట.
పురుషులు మీ శరీరంలోని ప్రతి అంగుళాన్ని నోట్ చేసుకుంటారు. మీ పుట్టుమచ్చ, మీరు మెరుస్తున్న తీరు, మీ పచ్చబొట్లు, కుట్లు ఏవైనా ఉంటే, అలాగే సాగిన గుర్తులను కూడా వారు గమనిస్తారు. వారు దానికి ఎలా స్పందిస్తారు అనేది వారి వ్యక్తిగతం. అయితే.. వాటి గురించి మాత్రం తర్వాత కచ్చితంగా మాట్లాడతారు.
పురుషులు పొడి చర్మాన్ని పెద్దగా ఇష్టపడరు. మీ చర్మంపై ఉండే గీతలు, స్క్రాచ్ లు వారికి పెద్దగా నచ్చవట. వారు శరీరంపై ప్రతి విషయాన్ని గమనిస్తారట.
మీ చర్మం నుంచి మంచి వాసన వస్తుందా..? లేక దుర్వాసన వస్తుందా అనే విషయాన్ని కూడా వారు గమనిస్తారట. మీ నుంచి వచ్చే వాసనను బట్టి.. వారు మీతో ఎలా ఉండాలి అనే విషయాన్ని బట్టి వారు తర్వాత ప్రొసీడ్ అవుతారట.
పురుషులు తమను తాము నిగ్రహించుకుంటారు! మీకు నచ్చితే తప్ప వారు మీపైకి దూసుకెళ్లడం లేదా హడావిడి చేయడం ఇష్టం లేదు. అతను మీ ప్రతిచర్యల కోసం ఎదరుచూస్తారు. మీకు నచ్చనిది చేయరు. వీరికి ఫోర్ ప్లే అంటే ఎక్కువ ఆసక్తి ఉంటుంది.
ఇక సెక్స్ విషయంలో మీరు ఎలా స్పందిస్తున్నారు.. ఏం చేస్తుంటే మీకు నచ్చుతుంది ఇలా ప్రతి విషయాన్ని వారు గమనిస్తారట. ఏ చర్యను స్త్రీ ఇష్టపడుతుందనే విషయాన్ని గమనిస్తారట.