ఈ అలవాట్లే మీ సెక్స్ లైఫ్ ను నాశనం చేస్తయ్..

First Published | Jul 11, 2023, 11:32 AM IST

లైంగిక జీవితం బాగుంటేనే మిగతా వైవాహిక జీవితం మొత్తం సాఫీగా, సంతోషంగా సాగుతుంది. లేదంటే ఎన్నో సమస్యలు వస్తాయి. కానీ కొన్ని అలవాట్లు మీ లైంగిక జీవితాన్ని నాశనం చేస్తాయి. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. 

ఒకరి చేతులు మరొకరు పట్టుకునే రోజులు గుర్తున్నాయా? రిలేషన్ షిప్ లో ఇక ఆ ఫీలింగ్ ఎన్నటికీ మరువలేనిది. ముఖ్యంగా భాగస్వాముల మధ్య లైంగిక జీవితం బాగుండాలి. అప్పుడే మీరు అన్ని విధాలా సంతోషంగా ఉంటారు. మంచి లైంగిక జీవితం మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. మీ భాగస్వామితో మీ బంధం కొనసాగుతుంది అనేది అందరికీ తెలిసిన వాస్తవం. వీటన్నింటికీ కారణం సెక్స్ సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్, డోపామైన్ వంటి హార్మోన్లు.

అలసట నుంచి లైంగిక పనిచేయకపోవడం వరకు మీ లైంగిక జీవితాన్ని ప్రభావితం చేసే అనేక సమస్యలు ఉన్నాయి. నిశ్చల జీవనశైలి వల్ల కూడా ఇలా కావొచ్చు. అందుకే మీ లిబిడోను పెంచడానికి మీరు కొన్ని జీవనశైలిలో మార్పులు చేయాలి. దీతో మీ లైంగిక జీవితం తిరిగి ట్రాక్ లోకి వస్తుంది. మీ లైంగిక జీవితాన్ని నాశనం చేసే అలవాట్లు ఏంటంటే..
 

Latest Videos


smoking

ధూమపానం 

స్మోకింగ్ ముందుగా మీ చిగుళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే నోటి దుర్వాసనకు కారణమవుతుంది. ఇక రెండోది ఇది మీ సెక్స్ డ్రైవ్ ను బాగా తగ్గిస్తుంది. జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ సైకియాట్రీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. పురుషులలో స్మోకింగ్ అంగస్తంభనకు కారణమవుతుంది. ఇక మహిళల్లో ఇది లిబిడోను తగ్గిస్తుంది. 
 

వ్యాయామం చేయకపోవడం

వ్యాయామం మన శరీరానికి చాలా చాలా అవసరం. వ్యాయామంతో మీ స్టామినా పెరుగుతుంది. వ్యాయామంతో మీరు మరింత శక్తివంతంగా, సరళంగా మారుతారు. దీంతో మీరు మీ సెక్స్ సెషన్ లో మరికొన్ని మెరుగైన భంగిమలను ట్రై చేయగలుగుతారు. ఇది ఖచ్చితంగా మీ సెక్స్ లో థ్రిల్ ను పెంచుతుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం .. వ్యాయామం మీ లైంగిక జీవితాన్ని మరింత ఉత్తేజకరంగా, ఎక్కువ సేపు పాల్గొనేలా చేయడానికి సహాయపడుతుందని చూపిస్తుంది. అలాగే లైంగిక రుగ్మతల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.
 

సమయానికి పడుకోకపోవడం

మీ సెక్స్ సెషన్  మెరుగ్గా, ఉత్తేజకరంగా ఉండాలనుకుంటే మీరు సమయానికి పడుకోవడం చాలా ముఖ్యం. శీఘ్ర శృంగారం కంటే ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనడం వల్ల మీ శరీరం రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గిపోతుంది. 
 

కెఫిన్ 

కాఫీ ఎక్కువగా తాగడం వల్ల మీ లైంగిక జీవితం దెబ్బతింటుంది. కెఫిన్ ఒక వాసోకాన్స్ట్రిక్టర్ అంటే ఇది మీ శరీరంలో రక్త ప్రవాహాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. పిఎల్ఎస్ వన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. మీ భాగస్వామి ఎక్కువగా కాఫీ తాగితే వారు అంగస్తంభన సమస్యను ఫేస్ చేయొచ్చు. కెఫిన్ ఎక్కువగా ఉండే పానీయాలను మానేయడం వల్ల ఈ సమస్య తగ్గుతుందని అధ్యయనంలో తేలింది.

sugar


చక్కెర

ఆరోగ్యకరమైన లైంగిక జీవితం కోసం యోనిని ఆరోగ్యంగా ఉంచడం చాలా అవసరం. సురక్షితమైన బయోమ్ ను నిర్వహించడానికి  మీ ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చండి. ఇది మీ యోని వాతావరణాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. యోని ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. ఎక్కువ చక్కెర మీ యోని ఆరోగ్యానికి అస్సలు  మంచిది కాదు. అమెరికన్ జర్నల్ ఆఫ్ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. మీ శరీరంలో ఎక్కువ చక్కెర యోని కాన్డిడియాసిస్ కు కారణమవుతుందని సూచిస్తుంది. ఇది యోని సంక్రమణ.
 

click me!