మీ సెక్స్ లైఫ్ బాగుండాలంటే ఇవి చాలా అవసరం మరి

First Published Dec 31, 2023, 11:26 AM IST

భార్యాభర్తల మధ్య సెక్స్ లైఫ్ బాగుంటేనే మిగతా లైఫ్ మొత్తం సాఫీగా, ఎలాంటి గొడవలు లేకుండా సాగుతుంది. అయితే ఈ లైంగిక సంబంధం మెరుగ్గా ఉండటానికి మీరు కొన్ని పనులను ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అవేంటంటే? 

వైవాహిక బంధం మనం కలలు కన్నట్టు, అనుకున్నట్టు ఎప్పుడూ ఉండదు. ముఖ్యంగా ఎప్పుడూ సంతోషంగా సాగుతుందన్న గ్యారెంటీ లేదు. చిన్న చిన్న కొట్లాటలు, గొడవలు, మనస్పర్థలు, విభేదాలు, సమస్యలు రావడం చాలా సహజం. వీటన్నింటినీ దాటుకుని వెళితేనే మీ బంధం ముందుకు సాగుతుంది. అయితే మీ మధ్య ప్రేమ పెరగడానికి, మీ లైంగిక జీవితం మెరుగ్గా ఉండటానికి ఎలాంటి చిట్కాలను ఫాలో కావాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

సమయాన్ని గడపడం

భార్యాభర్తల మధ్య లైంగిక జీవితం సాఫీగా సాగాలంటే మాత్రం ఇద్దరూ కలిసి రోజూ కాస్త సమయాన్ని గడపాలి. ముఖ్యంగా  ప్రతిరోజూ మీ భాగస్వామి కోసం కొన్ని నిమిషాల సమయాన్ని కేటాయించండి. అలాగే మీ రోజువారి కార్యకలాపాలను వారికి చెప్పండి. విషయాలను షేర్ చేసుకోండి. ఇది మీ భాగస్వామితో మీరు కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. అలాగే మీ భాగస్వామితో రోజూ ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించండి. అంటే వంట, డైలీ వాకింగ్, డ్యాన్స్ క్లాసులు, వ్యాయామం వంటి కార్యకలాపాల్లో కలిసి పాల్గొనండి. లేదా ప్రతిరోజూ కలిసి కాఫీ తాగండి.
 

కమ్యూనికేషన్

ఎలాంటి రిలేషన్ షిప్ కు అయినా సరే మంచి కమ్యూనికేషన్ చాలా చాలా అవసరం. మీ భాగస్వామితో ఈ భావోద్వేగ సంబంధాన్ని కొనసాగిస్తే.. మీరు సురక్షితంగా, సంతోషంగా భావిస్తారు. అందుకే జనాలుఒకరితో ఒకరు బాగా కమ్యూనికేట్ చేయడం ఆపేసినప్పుడు ఇది ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తుంది. అలాగే మనుషుల మధ్య విభేదాలు కూడా వస్తాయి.
 

నాన్ వెర్బల్ కమ్యూనికేషన్

నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కూడా మీ బంధాన్ని మెరుగుపరుస్తుంది. అంటే దీనిలో కళ్లతో మాట్లాడటం, ముఖ కవలికల ద్వారా హావభావాలను వ్యక్తపరచడం వంటివి ఉంటాయి. దీనిలో మీరు మీ భాగస్వామి చేతులను తాకొచ్చు. 

భావాలను గౌరవించడం

రసంబంధంలో మీ భాగస్వామి భావాలను గౌరవించండి. అలాగే వారికి అవసరమైన ప్రేమను, భావోద్వేగాన్ని తిరిగి ఇవ్వండి. మీ భాగస్వామికి ఏది ముఖ్యమో అది తెలుసుకోవాలి. ఇది మీపై నమ్మకాన్ని, ప్రేమను పెంచుతుంది. ఇది మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది. 

స్పర్శ ముఖ్యం

రిలేషన్ షిప్ లో స్పర్శ చాలా చాలా ముఖ్యం. ఇది వారిపై మీకున్న ప్రేమను వ్యక్తపరుస్తుంది. ఇది మీ శరీరం ఆక్సిటోసిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ఇవి హ్యాపీ హార్మోన్లు. ఇవి మనుషుల మధ్య కనెక్షన్, బంధాన్ని బలపరుస్తుంది. 

సెక్స్

బలమైన సంబంధంలో సెక్స్ ఒక ముఖ్యమైన భాగమే అయినప్పటికీ.. ఇది మాత్రమే శారీరక సాన్నిహిత్యంగా పరిగణించకూడదు. కొన్నిసార్లు కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం లేదా చేతులు పట్టుకోవడం ద్వారా  మీరు మీ భాగస్వామికి అవి ముఖ్యమైనవని భావించేలా చేయొచ్చు.
 

click me!