ప్రేమ.. ఇది లేనిది సృష్టి లేదు. ప్రేమించడం... ప్రేమించబడటం అనేది చాలా గొప్ప విషయం. ప్రేమించడం తప్పు కాదు.. అయితే.. ప్రేమలోనూ డిజార్డర్స్ ఉంటాయట. ఒకరితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలడం కూడా ఒక డిజార్డరేనట. ఒకరిని మనం ప్రేమిస్తే.. వారు ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. అయితే.. ప్రేమించిన వారిని ఊపిరాడనివ్వకుండా చేయడం.. నరకయాతన చేయడం డిజార్డర్ కిందకు వస్తాయి. దీనినే.. అబ్బెసివ్ లవ్ డిజార్డర్ (OLD) అంటారు. ఈ లక్షణాలు ఉన్నవారిని ఈ కింది సంకేతాలతో మనం గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ప్రేమించిన వారి గురించి ఆలోచించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ... ఈ డిజార్డర్ ఉన్నవారు మరీ అతిగా ఆలోచిస్తూ ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వారి గురించే ఆలోచిస్తూ ఉంటారు. తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తున్నా కూడా.. వారి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎంతలా అంటే.. వారిపై నిఘా పెట్టినట్లుగా.. నిత్యం వారి గురించే ఆలోచిస్తారు. అయితే.. అందులో మీకు ఎలాంటి తప్పు కనపడదు. కాకపోతే.. అది డిజార్డర్ కిందకి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రేమించిన వారిపట్ల పొసెసివ్ గా ఉండటంలో ఎలాంటి తప్పులేదు. కొద్దిగా.. పొసెసివ్ నెస్ ఎవరైనా చూపిస్తారు. బెస్టె ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు.. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లినప్పుడు.. పేరెంట్స్ ఉన్నప్పుడు పొసెసివ్ నెస్ చూపించడంలోనూ ఎలాంటి తప్పు లేదు.
కానీ.. మీరీ దారుణంగా.. వారు మార్కెట్ కి వెళ్లినా.. మిమ్మల్ని వదిలేసి వెళ్లినట్లు ఫీలై వారిపై అలగడం లాంటివి చేస్తే.. ప్రతీదీ వారి గురించి అతిగా ఆలోచించడం.. ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.
ఈ అబ్బెసివ్ లవ్ డిజార్డర్ తో బాధపడుతున్నవారు.. తాము ప్రేమించిన వారు పక్కన లేకుంటే వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా ఆలోచించకుండా.. నిత్యం మెసేజ్ లు చేస్తూనే ఉంటారు. కంటినక్యూస్ గా ఫోన్లు చేస్తూ ఉంటారు. అయితే.. నిత్యం మెసేజ్ లు చేయడం, ఫోన్లు మాట్లాడటం ఎవరి వల్లా కాదు అనే విషయం అర్థం చేసుకోవాలి.
ఇక ఈ డిజార్డర్ తో బాధపడేవారు.. వారు ప్రేమించిన వారితో తప్ప.. ఇతరులెవ్వరితోనూ సరదాగా కూడా ఉండలేరు. చుట్టూ అందరూ ఉండి.. ప్రేమించిన వ్యక్తి లేకుంటే ఏదో కోల్పోయినట్లు ఉంటారు. పక్కన వారితో కనీసం సరదాగా కూడా ఉండలేరు.
నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు..? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు,.? ఏం చేస్తున్నావు..? ఇంత సేపు ఎక్కడ ఉన్నావు..? ఇలాంటి ప్రశ్నలతో విసిగిస్తూ ఉంటారు. ఈ అబెసివ్ లవ్ డిజార్డర్ తో బాధపడేవారు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ పార్ట్ నర్ ని ఇబ్బంది పెడుతూ ఉంటారు.
ఈ లక్షణాలు మీలో కనుక ఉంటే.. వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించి.. ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. ఈ డిజార్డర్ ని అంత తేలికగా తీసుకునే విషయా కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.