మనమంతా మనుషులం. ఆనందం వస్తే నవ్వడం.. కష్టం వచ్చినప్పుడు బాధపడటం, నొప్పి అనిపించడం నవ్వడం.. ఎలా అయితే సాధారణమో.. ఎవరైనా నచ్చితే.. వారిని ఇష్టపడటం కూడా అంతే సర్వ సాధారణ విషయం. అయితే.. చాలా మంది తాము ఎదుటి వ్యక్తిని ఇష్టపడుతున్నాము అనే విషయాన్ని వారికి తెలియజేయరు. . కానీ.. వారు చెప్పకున్నా.. మన మనసు మాత్రం మనకు ఆ విషయాన్ని ఏదో ఓక విధంగా తెలియజేస్తూ ఉంటుందట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
మీకు తెలియని వ్యక్తి.. పెద్దగా పరిచయం లేని వ్యక్తులు.. తరచూ కలల్లోకి వస్తున్నారు అంటే.. వారు మీ గురించి ఆలోచిస్తున్నారు అని అర్థం. ఆ వ్యక్తితో మీకు కనెక్షన్ పెరుగుతోంది అని తెలియజేయడానికే ఇలా కలల్లోకి ఆ వ్యక్తులు వస్తూ ఉంటారట. ఇది మొదటి సంకేతమట. అలా తరచూ కలలోకి వస్తున్నారు అంటే.. అంత సులభంగా వదిలేయకండి.
మీరు నమ్మకపోవచ్చు కానీ.. మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి ఎదురుగా వచ్చినప్పుడు మీకు ఎక్కిళ్లు వస్తాయట. సడెన్ గా వారిని చూసినప్పుడు అలా ఎక్కిళ్లు వస్తాయట. అంతేకాదు.. మీ ఎక్కిళ్లు రావడానికి.. వారు మిమ్మల్ని తలుచుుకోవడమే కారణం అని కూడా కొందరు అనుకుంటూ ఉంటారు.
ఎవరైనా మీ గురించి మంచిగా ఆలోచిస్తుంటే, మీరు నవ్వుతూ ఉండవచ్చు. ఎందుకో కూడా తెలియకుండానే మీరు సంతోషంగా మరియు ఆనందంగా ఉంటారు. వింతగా అనిపించినా ఇది నిజం!
మీ మూడ్ స్వింగ్స్ వెంట వెంటనే మారుతూ ఉంటాయి. మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడితే.. మీకు అలా జరిగే అవకాశం ఉంటుందట. మీ ఆలోచనలు కూడా మిమ్మల్ని.. ఎదుటి వ్యక్తితో కలపడానికి చూస్తాయట.
మీరు సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరో వ్యక్తి వచ్చి కాపాడినట్లు కలలు రావడం .. అదే కరెక్ట్ గా మీ జీవితంలోనూ జరగడం జరిగితే.. ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నాడని.. ఆ వ్యక్తికి మీరు కూడా మానసికంగా కనెక్ట్ అయ్యారని అర్థమట.