పిల్లలతో సెక్స్ గురించి పేరెంట్స్ ఎలా మాట్లాడాలి..?

First Published Nov 3, 2021, 1:37 PM IST

ఈ విషయాల గురించి సిగ్గుపడుతూ కూర్చుంటే.. తర్వాత తమ పిల్లలు ఇబ్బందిపడతారనే విషయాన్ని గుర్తించాలి. శారీరక, మానసిక ఎమోషన్స్ గురించి వారికి క్షున్నంగా వివరించాలి.

పిల్లలు తప్పు చేసినా.. కరెక్ట్ చేసినా.. అందులో సగానికిపైగా ప్రభావం తల్లిదండ్రులమీదే ఉంటుంది.  అది ఏ విషయమైనా సరే. చిన్న తనం నుంచే ఏది తప్పు, ఏది ఒప్పు అనే విషయాన్ని మనం చిన్న తనం నుంచే వారికి చెబుతూ ఉండాలి. చాలా మంది తల్లిదండ్రులు.. తమ పిల్లలతో అన్ని విషయాలను మాట్లాడగలరు. కానీ.. సెక్స్ విషయం గురించి చర్చించడానికి ఇష్టపడరు. దీంతో.. పేరెంట్స్ కూడా చెప్పకపోవడంతో.. ఆ విషయం గురించి కొందరికి అవగాహన లేకుండా పోతుంది. మరికొందరికీ.. ఇతర మార్గాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయడం.. లేదంటే కొందరు.. తమకు తెలిసిందే.. నిజమని అనుకుంటూ ఉంటారు.

నిజానికి పిల్లలు.. టీనేజ్ వయసు వచ్చే సరికి.. సెక్స్ గురించి వారికి అవగాహన కలిగించాలి. అది కేవలం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది. ఈ విషయాల గురించి సిగ్గుపడుతూ కూర్చుంటే.. తర్వాత తమ పిల్లలు ఇబ్బందిపడతారనే విషయాన్ని గుర్తించాలి. శారీరక, మానసిక ఎమోషన్స్ గురించి వారికి క్షున్నంగా వివరించాలి.
 

దాదాపు అందరు తల్లిదండ్రులు.. తమ టీనేజ్ పిల్లలతో ఇలాంటి విషయాల గురించి మాట్లాడరు. వారంతట వారే తెలుసుకుంటారు లే అనుకుంటూ ఉంటారు.  అయితే.. అది  చాలా తప్పు అని నిపుణులు చెబుతున్నారు. అలా చెప్పకపోవడం వల్ల తప్పులు జరుగుతూ ఉంటాయి. టీనేజ్ వయసు వచ్చిన వారికి సరైన మార్గదర్శకం కేవలం తల్లిదండ్రులు మాత్రమే ఇవ్వగలరు అనే విషయాన్ని గుర్తించాలి. కాబట్టి.. వారికి వివరంగా.. అర్థమయ్యే రీతిలో చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంటుంది. వారిలో మొదలైన అపోహలను వారు కూడా మీతో చర్చించగలుగుతారు. పొరపాట్లు చేయకుండా ఉంటారు.

Sex Education

సెక్స్ గురించిన జ్ఞానం పెద్దలకు మాత్రమే కాదు, యుక్తవయస్సులోకి ప్రవేశించే అంచున ఉన్న యువకులకు కూడా ముఖ్యమైనది. సరైన అవగాహన వారికి ఉంటే.. ఏ వయసులో దానికి కమిట్ అవ్వాలి అనే విషయం వారికి అర్థమౌతుంది.

పుస్తకాల్లో కొంత వరకు సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటున్నా.. వారికి వచ్చే అనుమానాలు కేవలం తల్లిదండ్రులు మాత్రమే తీర్చగలరు. కాబట్టి.. వారికి ఈ విషయంలో తల్లిదండ్రులే అండగా ఉండాలి. వారికి ఉండే భయాలు, అనుమానాలు, ఆతురత లాంటివి అవగాహన కల్పించాలి.
 

sex education


తల్లిదండ్రులతో పాటు.. తమ టీనేజ్ పిల్లలు కూడా ఈ విషయాల గురించి మాట్లాడటానికి ఇబ్బందిగా భావించే అవకాశాలు ఉన్నాయి. అయితే..  వారితో తరచూ ఆ టాపిక్ తీసుకురావడం వల్ల.. వారు ఆ ఇబ్బంది నుంచి బయటపడి.. అన్ని విషయాలను మీతో ఫ్రీగా చర్చించే అవకాశం ఉంటుంది.

టీనేజ్ వయసులో శృంగారం.. ఎన్ని సమస్యలు తీసుకువస్తుంది..  ఏ వయసులో ఇది కరెక్ట్.. గర్భం, అసురక్షిత శృంగారం.. సెక్స్ సంబంధిత వ్యాధులు.. ఇలా ప్రతి విషయాన్ని సున్నితంగా.. చెప్పదగిలిన భాషలో చెప్పగలగాలి.
 

యుక్తవయస్కులతో సెక్స్ విషయాలను చర్చిస్తున్నప్పుడు, తల్లిదండ్రులు సమ్మతిని అర్థం చేసుకోవడంలో వారికి సహాయం చేయాలి. వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా..? వారితో ఏ స్టేజ్ లో ఉన్నారు.. లాంటి విషయాలను కూడా గమనించాలి. వారు మీతో అన్ని విషయాలు చర్చించుకునే ఫ్రీడమ్ మీరు వారికి ఇవ్వాలి.

లైంగిక సమ్మతి గురించి మీ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, సెక్స్ అనేది కేవలం శారీరక అవసరాలకే కాదు, ఇద్దరు ఆత్మల కలయిక అనే విషయాన్ని వారికి నొక్కి చెప్పాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే.. వారు సెక్స్ విషయంలో తప్పులు చేయరు. 

click me!