ప్రెగ్నెన్సీ విషయంలో ఆడవారికి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. ఎందుకంటే ఈ సమయంలో వీరు ఏం చేసినా కడుపులోని బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని. ప్రెగ్నెన్సీ టైంలో సెక్స్ చేయాలా? వద్దా? అనే సందేహాలు కూడా వస్తుంటాయి. అయితే కొంతమంది ఈ టైంలో కూడా సెక్స్ లో పాల్గొంటుంటారు. కానీ గర్బవతిగా ఉన్నప్పుడు కొన్ని నెలల్లో సెక్స్ లో పాల్గొనకూడదని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం.. గర్భధారణ సమయంలో సెక్స్ చేయడానికి మూడు నెలలు అంటే 4,5,6 నెలలు సురక్షితమైనవని డాక్టర్లు చెబుతున్నారు. అయితే సెక్స్ పాల్గొనడానికి ఆడవారి అనుమతి చాలా అవసరం.
గర్భవతిగా ఉన్నప్పుడు సెక్స్ చేయడం ఎంత సురక్షితం?
గర్భాశయంలో ఉండే బలమైన కండరాలు గర్భంలోని బిడ్డను సురక్షితంగా ఉంచుతాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ చేయడం వల్ల బేబీకి ఎలాంటి హాని జరగదని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ తర్వాత గర్భంలోని శిశువు కదిలే అవకాశం ఉంది. అయితే మీరు దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
గర్భవతిగా ఉన్నప్పుడు ఏ నెలలో సెక్స్ చేయకూడదు?
గర్భం దాల్చిన మొదటి నెలలో గర్భస్రావం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే గర్భం దాల్చిన కొన్ని నెలలు సెక్స్ కు దూరంగా ఉండాలంటారు నిపుణులు. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారంలో ఎలాంటి ఇబ్బంది కలిగినా హాస్పటల్ కు వెళ్లాలి. ప్రెగ్నెన్సీలో ఎలాంటి సమస్యలు లేకుంటేనే సెక్స్ పాల్గొనడం మంచిది. చాలా లైంగిక భంగిమలు సురక్షితమైనవి. మీ గర్భం పెరుగుతున్న కొద్దీ సెక్స్ పొజీషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో లైంగిక కోరికలు మారొచ్చు.
Sex
అయితే మీకు గతంలో గర్భస్రావం అయినట్టైతే, గర్భధారణలో ఏదైనా సమస్య ఉంటే, గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటే శృంగారానికి దూరంగా ఉండటమే మంచిది. దీనివల్ల టైం కంటే ముందుగానే డెలివరీ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇంతకు ముందు బిడ్డ మీకు ఇలాగే పుట్టినా కూడా మీరు శృంగారానికి దూరంగా ఉండాలి. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో డాక్టర్ సలహా తీసుకుని సెక్స్ లో పాల్గొనడం మంచిది.