ప్రెగ్నెన్సీ లో సెక్స్... ఈ పొరపాట్లు చేయకండి...!

First Published Sep 2, 2022, 2:16 PM IST

డుపులోని బిడ్డకు ఎలాంటి ఇబ్బంది, ఒత్తిడి పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాంటి పొజిషన్స్ ఎంచుకోవడం మంచిది. స్పూన్ పొజిషన్ ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
 


గర్భం దాల్చడం స్త్రీ జీవితంలో అతి కీలకమైన సమయం. ఓ బిడ్డకు జన్మనివ్వడం స్త్రీకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ సమయంలో వారికి ఏవేవో కోరికలు కలుగుతూ ఉంటాయి. కేవలం ఆహారం తినే విషయంలో మాత్రమే కాదు.. ప్రెగ్నెన్సీ లో సెక్స్ కి సంబంధించిన కోరికలు కూడా కలుగుతూ ఉంటాయట. అయితే... చాలా మంది ప్రెగ్నెన్సీలో కలయికకు దూరంగా ఉండాలని చెబుతూ ఉంటారు. కానీ నిజానికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ... జాగ్రత్తగా మాత్రం ఉండాలి. కొన్ని చేయవచ్చు.. కొన్ని చేయకూడదు. అవేంటో ఓసారి చూద్దాం...

గర్భం దాల్చిన తర్వాత.. అన్ని రకాల సెక్స్ పొజిషన్స్ ప్రయత్నించలేం. కాబట్టి.. కడుపులోని బిడ్డకు ఎలాంటి ఇబ్బంది, ఒత్తిడి పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాంటి పొజిషన్స్ ఎంచుకోవడం మంచిది. స్పూన్ పొజిషన్ ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు సెక్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు నిజంగా లూబ్రికేట్‌గా ఉండాలి. సరైన రకమైన లూబ్రికేషన్ ఎంచుకోవడం చాలా అవసరం. 
 

అందరికీ గర్భం దాల్చిన సమస్యలు ఉండకపోవచ్చు. కానీ కొందరికి మాత్రం కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటివారు మాత్రం సెక్స్ కి దూరంగా ఉండటమే మంచిది. లేదంటే.. గర్భస్రావం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదు అంటే వైద్యుల సలహా తీసుకోవడం చాలా అవసరం.

గర్భిణీలు ఎక్కువ శాతం ఆ సమయంలో ఎక్కువగా ఒత్తిడికి గురౌతూ ఉంటారట. ఆ ఒత్తిడి, ఆందోళన తగ్గించుకునేందుకు సెక్స్ లో పాల్గొనవచ్చు. ఎందుకంటే సక్స్ మన శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. మంచి హార్మోన్లను విడుదల చేస్తుంది. గర్భం సమయంలో దంపతుల మధ్య దూరం పెరగకుండా ఉండేలా చూసుకుంటుంది.
 

లేదు.. కాంప్లికేషన్స్ ఉన్నాయి కానీ కలయికలో పాల్గొనాలని ఉంది అంటే... ఇతర మార్గాల్లో ఆనందాన్ని వెతుక్కోవాలి. అంటే... ఓరల్ సెక్స్, హస్త ప్రయోగం, సెక్స్ టాయ్స్ లాంటివి ఉపయోగించి కూడా ఆనందాన్ని పొందవచ్చు.

click me!