దంపతులు ఇలా చేస్తే పిల్లలు త్వరగా పుట్టే అవకాశం.. ఎలా అంటే?

First Published Nov 7, 2021, 7:26 PM IST

దాంపత్య జీవితంలో పిల్లలు పుట్టడం అనేది ఒక వరం లాంటిది. చాలా మంది మహిళలు మాతృత్వం (Motherhood) కోసం తపిస్తూ ఉంటారు. పిల్లలు పుట్టలేదని వారు ఎంతో వేదనకు గురవుతుంటారు. అయితే ఈ ఆర్టికల్ (Article) ద్వారా దంపతులకు పిల్లలు త్వరగా పుట్టాలంటే ఏం చేయాలో తెలుసుకోండి..
 

పెళ్లయ్యాక సరైన సమయానికి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవాలి. అలా కాదని ప్రత్యేక నిరోధక మాత్రలు వాడితే అది మీ ప్రెగ్నెన్సీ పైన ప్రభావితం చూపుతాయి. ప్రెగ్నెన్సీ ప్లాన్ (Pregnancy plan) చేసుకున్న సంవత్సరమైన ప్రెగ్నెన్సీ రాకపోతే వారు నిరుత్సాహపడతారు. దాంతో ఒత్తిడికి గురవుతుంటారు. వారి మీద వారికే అసహనం కలుగుతుంది. దీనికి మీ శరీరంలోని ఆ హార్మోన్ల (Hormone) అసమతుల్యతే కారణం.
 

మహిళలలో నెలసరి క్రమం తప్పకుండా సరైన సమయంకి వస్తుంటే వారికి ప్రెగ్నెన్సీ (Pregnancy) త్వరగా వస్తుంది. కొందరు మహిళల్లో పీరియడ్స్ రెగ్యులర్ గా రావు. అలాంటి వారికి సంతానం కలగడానికి ఆలస్యం అవుతుంది. మీ నెలసరి రెగ్యులర్ గా వచ్చేందుకు సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. మగవారిలో వీర్యకణాల (Sperm) ఉత్పత్తి సరిగా ఉండాలి.
 

మగవారిలో వీర్యకణాల సంఖ్య సరిగా ఉన్నట్లయితే వెంటనే గర్భం ధరించవచ్చు. అప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మహిళల్లో హార్మోన్ల సమతుల్యత సరిగ్గా ఉండాలి. భార్యభర్తలు కనీసం వారంలో రెండు మూడు సార్లు అయినా శృంగారంలో (Romance) పాల్గొనాలి.అయినా ప్రెగ్నెన్సీ (Pregnancy) రాకపోతే దీనికి చాలా కారణాలు ఉన్నాయి.
 

ఆడవారిలో ప్రతి నెల ప్రెగ్నెన్సీకి కావలసిన అండాలు విడుదలవుతాయి. అయితే ఆడవారిలో ప్రతినెలకి ఒక సారి మాత్రమే అండం విడుదల అవుతుంది. ఆ సమయంలో ఆ అండం శరీరంలో 24 గంటలు మాత్రమే జీవించి ఉంటుంది. ఆ సమయంలో సెక్స్ (Sex) లో పాల్గొంటే గర్భం (Pregnancy) వస్తుంది. మీ నెలసరి వచ్చిన మొదటి రోజు నుండి 13,14,15 వ ఈ రోజుల్లో ఆడవారిలో అండాలు విడుదలవుతాయి.
 

ఈ తేదీలకు ముందు, తర్వాత ఎన్ని సార్లు sex పాల్గొన్నా అండాలు విడుదల కావు. ఆ సమయంలో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మగవారిలోని వీర్యకణాలు (Sperm) స్త్రీ లోని అండం రెండు కలవడమే ప్రెగ్నెన్సీకి (Pregnancy) మూలం. దంపతులు ఒకే రాత్రి రెండోసారి సెక్స్ చేస్తే మహిళలు గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు.
 

రాత్రి పూట ఒకసారి సెక్స్ (Sex) లో పాల్గొన్నాక  మూడుగంటల తర్వాత రెండోసారి సెక్స్ లో పాల్గొనాలి. రెండోసారి సెక్స్ లో జరిగే కలయికలో విడుదలయ్యే స్పెర్మ్ (Sperm) చాలా బలంగా ఉంటుంది. దీంతో ప్రెగ్నెన్సీ త్వరగా వస్తుంది. ఇలా చేసిన ప్రెగ్నెన్సీ రాకపోతే మీరు డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది. డాక్టర్ సలహాలు సూచనలు తీసుకోవడం అవసరం. అప్పుడు మీ మాతృత్వ కల నెరవేరుతుంది.

click me!