ఒక వ్యక్తి తన భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్‌ని (condom)తీసివేయడం చట్టవిరుద్ధమని కాలిఫోర్నియా (California) ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇలాంటి బిల్లు ఆమోదం పొందడం అమెరికాలో ఇదే మొదటిసారి.
శాసనసభ్యుడు క్రిస్టినా గార్సియా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. గురువారం, గవర్నర్ గావిన్ న్యూస్ బిల్లుపై సంతకం చేశారు. ఆ తర్వాత ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ ను షేర్ చేశారు. పార్ట్నర్ అనుమతి ప్రాముఖ్యతను చెప్పడానికె బిల్లును ఆమోదించబడినట్లు గవర్నర్ ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
''సెక్స్ (sex)సమయంలో ఈ విధంగా ప్రవర్తించడం నైతికం కాదు, కానీ ఇది కేవలం నైతికత మాత్రమే కాదు, ఇప్పుడు అది చట్టవిరుద్ధం '' అని ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత క్రిస్టినా గార్సియా పోస్ట్ చేసింది. సెక్స్ (sex)సమయంలో ఏకపక్ష నిర్ణయం సమయంలో కండోమ్‌లను (condom)మార్చడం తరచుగా మహిళ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
ఇది గర్భధారణ, లైంగిక సంక్రమణ వ్యాధుల వంటి అనేక తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. అలాంటి ఫిర్యాదులు కూడా తలెత్తుతాయి. కానీ ఇది చట్ట పరిధిలోనిది కాదని చెప్పిన క్రిస్టినా.. అలా గర్భం దాల్చిన మహిళలకు ఎలాంటి న్యాయం జరగదు అందుకే ఇలా చేశామన్నారు.
2017 నుంచి బిల్లు ఆమోదం పొందాలని క్రిస్టినా ఒత్తిడి చేస్తోంది. ఫెమినిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలతో సహా చాలామంది బిల్లుకు మద్దతు ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఆమోదించడంతో కాలిఫోర్నియా (California) మరో ముందడుగు వేసిందని చెప్పొచ్చు.
భారతదేశంలో కూడా సెక్స్ (sex)ఎడ్యుకేషన్‌పై చర్చలు వేడెక్కుతున్న ఈ సందర్భంలో ఇటువంటి వార్తలు మరింత ఆ చర్చలకు మరింత బలాన్ని ఇస్తున్నాయ్. సెక్స్‌లో (sex) మహిళలకు, పురుషులకు సమాన హక్కులు కలిగి ఉంటారని కాలిఫోర్నియా (California) బిల్లును అమలు చేసి నిరూపించింది.