మద్యం, స్మోకింగ్, డ్రగ్స్ కి బానిసలు అయిన వారు మనకు తరచూ ఎదురుపడుతూనే ఉంటారు. వాటికి బానిసలు కావడం వల్ల కలిగే నష్టాలు కూడా మనకు తెలుసు. కానీ.. సెక్స్ , పోర్న్ కి బానిసగా మారడం కూడా ప్రమాదమేనా..? అవుననే అంటున్నారు పరిశోధకులు.
undefined
పోర్న్ చూసే అలవాటు చాలా మందికే ఉండి ఉంటుంది. పెళ్లి కాని వారో.. పార్ట్ నర్ పక్కన లేనివారో. వాటిని చూడటం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. అయితే.. అది ఎంత వరకు అన్నది మాత్రం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
అసలు.. పోర్న్ కి బానిసలు అయ్యారో లేదో తెలుసుకోవడం ఎలా అనే సందేహం మీకు కలిగి ఉండొచ్చు.. ఒకవేళ బానిసగా మారినా.. దాని నుంచి ఎలా బయటపడాలో తెలియకపోవచ్చు.. దాని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
undefined
పోర్న్ చూడటం తప్పు కాకపోవచ్చు. అయితే.. అతిగా చూడటం మాత్రం ప్రమాదమని చెబుతున్నారు. దానికంటూ ఓ సమాయాన్ని కేటాయించుకోవడంలో తప్పులేదంటున్నారు.
undefined
వారానికి అరగంట లేదా.. వారానికి రెండు గంటలకు ఇలా సమయాన్ని పెట్టుకోని.. దానికి తగినట్లు చూడాలని చెప్పారు. అలా కాకుండా గంటలకొద్దీ చూడటం దానికి బానిసగా మారడమేనని చెబుతున్నారు.
undefined
చాలా మంది పెళ్లైన వారికి కూడా ఈ వీడియోలు చూసే అలవాటు ఉండొచ్చు. అయితే.. మీతో పాటు మీ భార్యలకు కూడా వీటిని చూపించమని నిపుణులు చెబుతున్నారు
undefined
వారికి ఎలాంటి అభ్యంతరం లేకపోతే.. ఇద్దరూ కలిసి వాటిని చూడొచ్చని.. దాని ద్వారా మీ శృంగార జీవితం మరింత ఆనందంగా సాగుతుందని చెబుతున్నారు.
undefined
కొందరు.. ఎక్కడ చూస్తున్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. ఉదాహరణకు ఆఫీసులు, బస్సులు లాంటి వాటిల్లో వీటిని చూడటం మంచిది కాదు.
undefined
మీకు అలాంటి అలవాటు ఉందని మీ స్నేహితులకు తెలిస్తే.. మీరే వాళ్ల ముందు చులకన అయిపోతారు. పబ్లిక్ ప్లేస్ లలో అస్సలు చూడటం మంచిది కాదు.
undefined
మరీ ఎక్కువగా దీనికి అలవాటు పడిపోతున్నామనే భావన కలిగితే.. దానిని అవాయిడ్ చేయడం ఉత్తమం. దానికి బదులు మ్యూజిక్ వినడం, వాకింగ్, జాగింగ్ లాంటివి చేయాలని చెబుతున్నారు.
undefined
ఇక చాలా మందికి ఒంటరిగా ఉన్న సమయంలోనే వీటిని చూడాలనే ఆలోచన కలుగుతుంది. కాబట్టి.. సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండకుండా ఉండటం మంచిది.
undefined
ప్రస్తుతం లాక్ డౌన్ కదా.. ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నామని చాలా మంది సమాధానం చెబుతున్నారు. ఆ సమయాన్ని ఈ వీడియోలకు కాకుండా... ఏదైనా ఫ్రీలాన్సింగ్ వర్క్ కోసం ప్రయత్నించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
undefined
అదీ కాదంటే.. మీకు ఆల్రెడీ పెళ్లి అయ్యి ఉంటే.. ఆ సమయాన్ని మీ భార్యతోనే గడపడానికి ప్రయత్నించండి. పోర్న్ చూడటం కన్నా.. పార్ట్ నర్ తో నిజంగా సమయం గడపడం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది.
undefined
కేవలం పోర్న్ మాత్రమే కాదు.. శృంగారానికి బానిసవ్వడం కూడా మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
సెక్స్ ఆరోగ్యానికి మంచిది అన్న విషయం తెలిసిందే. అయితే.. అదే శృంగారం శృతి మించితే మాత్రం ప్రమాదం అంటున్నారు నిపుణులు.
undefined
ఎక్కువగా సెక్స్ చేస్తేనే బానిసలుగా మారినట్లు కాదు. గంటల తరబడి పోర్న్ చిత్రాలు చూడటం. సెక్స్ కోరికలు ఎక్కువగా కలిగి ఉండటం.. తరచూ సెక్స్ చేయాలని అనిపించడం కూడా దీని కిందకే వస్తుందని అంటున్నారు.
undefined
2013 నుంచి ఇప్పటి వరకూ బ్రిటన్‌కు చెందిన 21,000 మంది ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారట. వీరిలో 91 శాతం మంది పురుషులు. కాగా.. బాధితుల్లో కేవలం 10 శాతం మంది మాత్రమే వైద్యుల వద్దకు వెళ్లారు.
undefined
2013లో సెక్స్ ఎడిక్షన్‌ను మానసిక రుగ్మతల జాబితాలో చేర్చాలని అమెరికా, బ్రిటన్‌లు భావించాయి.
undefined
అయితే సెక్స్‌ను ఓ వ్యసనంగా గుర్తించేందుకు సరైన ఆధారం లేకపోవడంతో దీన్ని రుగ్మతల జాబితాలో చేర్చలేదు.కానీ.. ‘‘కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్’’ను ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించే అంతర్జాతీయ రోగాల వర్గీకరణలో చేర్చాలని ప్రతిపాదనలు వచ్చాయి.
undefined
గతంలో జూదాన్ని, అదే పనిగా తినడాన్ని కూడా కంపల్సివ్ బిహేవియర్స్‌లో చేర్చారు. అలాగే ఇప్పుడు సెక్స్ ఎడిక్షన్ కూడా అందులో చేరుతుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
undefined
2014లో ఓ అధ్యయనం నిర్వహించగా.. పోర్న్ వీడియోలు చూస్తున్నపుడు, డ్రగ్స్ తీసుకుంటున్నపుడూ మెదడులో ఒకే తరహా చర్యలు జరిగాయని గుర్తించారు.
undefined
అయితే దీని ఆధారంగా సెక్స్‌ను ఒక వ్యసనంగా పరిగణించలేమని ఈ అధ్యయానికి నేతృత్వం వహించిన పరిశోధకుడు డాక్టర్ వెలరే వూన్ తెలిపారు.
undefined
కొందరు మాత్రం ఈ వాదనను తప్పుపడుతున్నారు. సెక్స్ లేదా హస్త ప్రయోగాన్ని ఆల్కహాల్, ఇతర డ్రగ్స్‌తో పోల్చడం హాస్యాస్పదమని మరికొందరు పేర్కొనడం విశేషం.
undefined