రోజురోజుకు అలాంటి కోరికలు సన్నగిల్లుతున్నాయా.. అయితే ఇవి ఖచ్చితంగా తెలుసుకోండి!

First Published | Jan 27, 2022, 3:26 PM IST

భాగస్వామి పక్కనే ఉన్న దగ్గరకు తీసుకోవాలనిపించడం లేదా సెక్స్ పట్ల కోరికలు తగ్గుతున్నాయి. ఈ సమస్యలు మహిళలు, పురుషులు ఇద్దరిలోనూ కనిపిస్తుంటాయి. దీనిని లిబిడో తగ్గడం (Decreased libido)అంటారు. సెక్స్ పట్ల కోరికలు (Desires for sex) తగ్గడానికి అనేక కారణాలు కారణంకావచ్చు. మరీ సెక్స్ పట్ల కోరికలు సన్నగిల్లడానికి కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

గుండె జబ్బులు, అధిక రక్తపోటు: సెక్స్ కోరికలు తగ్గడానికి గుండె జబ్బులు (Heart disease), అధిక రక్తపోటు (High blood pressure) కూడా కారణం కావచ్చు. గుండె జబ్బుల కారణంగా రక్తనాళాలు దెబ్బతిని రక్త సరఫరా తగ్గడం జరుగుతుంది. దీని ప్రభావం జననాంగాలపైన కూడా ఉంటుంది. దీంతో జననాంగాలకు రక్త సరఫరా తగ్గి సెక్స్ కోరికలు తగ్గుతాయి. కనుక సెక్స్ కోరికలు తగ్గడానికి గుండెజబ్బులు, అధిక రక్తపోటు సమస్యలు ఉన్నాయో లేదో పరిశీలించుకోండి.
 

గుండె జబ్బులు, అధిక రక్తపోటు: సెక్స్ కోరికలు తగ్గడానికి గుండె జబ్బులు (Heart disease), అధిక రక్తపోటు (High blood pressure) కూడా కారణం కావచ్చు. గుండె జబ్బుల కారణంగా రక్తనాళాలు దెబ్బతిని రక్త సరఫరా తగ్గడం జరుగుతుంది. దీని ప్రభావం జననాంగాలపైన కూడా ఉంటుంది. దీంతో జననాంగాలకు రక్త సరఫరా తగ్గి సెక్స్ కోరికలు తగ్గుతాయి. కనుక సెక్స్ కోరికలు తగ్గడానికి గుండెజబ్బులు, అధిక రక్తపోటు సమస్యలు ఉన్నాయో లేదో పరిశీలించుకోండి.
 

Latest Videos


మధుమేహం: మధుమేహం (Diabetes) కూడా సెక్స్ కోరికలు తగ్గడానికి ప్రధాన కారణం కావచ్చు. రక్తంలోని చక్కెర స్థాయిలు (Sugar levels) పెరగడంతో రక్తనాళాలు గట్టిపడి జననాంగాలకు రక్తసరఫరా తగ్గుతుంది. దీంతో పురుషులలో అంగస్తంభన జరగదు. అదేవిధంగా స్త్రీలలో కూడా యోనికి రక్తప్రసరణ తగ్గుతుంది. ఈ సమస్యల కారణంగా సెక్స్ పట్ల కోరికలు సన్నగిల్లుతాయి. 
 

కొన్ని రకాల మందులు: కొన్ని రకాల హార్మోనల్ కాంట్రాసెప్టివ్స్, యాంటిడిప్రసెంట్లు (Antidepressants), యాంటిసైకోటిక్స్ (Antipsychotics), ప్రోస్టేట్ వాపుకు వాడే మందుల ప్రభావం కూడా సెక్స్ జీవితంపై ప్రభావితం చూపుతాయి. దీంతో సెక్స్ పట్ల విముఖత ఏర్పడుతుంది.
 

చెడు అలవాట్లు: మద్యపానం (Alcohol), ధూమపానం (Smoking) వంటి చెడు అలవాట్ల కారణంగా కూడా సెక్స్ పట్ల విముఖత ఏర్పడుతుంది. ఈ అలవాట్లకు దూరంగా ఉంటూ భాగస్వామితో కలిసి సంపూర్ణమైన సెక్స్ జీవితాన్ని అనుభవించండి.
 

కీళ్ల నొప్పులు, క్యాన్సర్: కీళ్ల నొప్పుల (Arthritis) కారణంగా కూడా ఆ కార్యంలో పాల్గొనడానికి ఆసక్తి చూపరు. అలాగే శస్త్రచికిత్స కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటి కాన్సర్‌ (Cancer) చికిత్సల కారణంగా సెక్స్ పైన ఆసక్తి. అదే విధంగా శ్వాసకు సంబంధించిన సమస్యలు, గురక ఫలితంగా కూడా సెక్స్ పట్ల కొంత విముఖత ఏర్పడుతుంది.
 

ఒత్తిడి కారణాలు: అధిక ఒత్తిడి, ఆందోళన (Anxiety), భావోద్వేగాలు (Emotions), ఆత్మవిశ్వాసం లోపించడం కారణంగా సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో సెక్స్ కోరికలు తగ్గుతాయి. దీంతో ఆ కార్యం పట్ల ఆసక్తి చూపరు.  కనుక మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే సెక్స్ పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 

హార్మోన్లలో మార్పులు: స్త్రీలలో మోనోపాజ్ (Monopause) కారణంగా వచ్చే హార్మోన్లలో మార్పులు కారణంగా సెక్స్ పట్ల ఆసక్తి తగ్గుతుంది. దీంతో సెక్స్ కోరికలు తగ్గుతాయి. అలాగే గర్భం దాల్చినప్పుడు, ప్రసవం అయిన తర్వాత శరీరంలో కలిగే హార్మోన్ల మార్పుల (Hormonal changes) కారణంగా కూడా ఇందుకు కారణం కావచ్చు. 
 

చికిత్స: ఈ సమస్యల గురించి మొహమాటపడకుండా వైద్యులతో చర్చించడం మంచిది. సరైన చికిత్స (Treatment) తీసుకుంటూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ పౌష్టికాహారం (Nutrition), నిద్ర, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, బరువు తగ్గడం, యోగ, వ్యాయామం వంటి చర్యలను అనుసరించే మంచి ఫలితం ఉంటుంది.

click me!