World Athletics Day: మీ పిల్లలు అథ్లెటిక్స్‌లో రాణించాలా? ఈ న్యూట్రిషన్ ప్లాన్ ఫాలో అయిపోండి

Published : May 07, 2025, 01:42 PM IST

World Athletics Day: చిన్న వయసులోనే పిల్లల అభిరుచిని గమనించి ఆ రంగంలో సరైన శిక్షణ ఇప్పిస్తే ఈజీగా రాణించగలుగుతారు. మీ పిల్లలు అథ్లెటిక్స్ లో రాణించాలని తల్లిదండ్రులుగా మీరు కోరుకుంటే మీ పిల్లల ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలి? ఎలాంటి న్యూట్రిషన్ ప్లాన్ ఫాలో అవ్వాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

PREV
15
World Athletics Day: మీ పిల్లలు అథ్లెటిక్స్‌లో రాణించాలా? ఈ న్యూట్రిషన్ ప్లాన్ ఫాలో అయిపోండి

ప్రతి సంవత్సరం మే 7న ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం నిర్వహిస్తారు. ప్రజలలో అథ్లెటిక్స్ గురించి అవగాహన పెంచడానికే ఈ రోజును ప్రత్యేకంగా నిర్వహిస్తారు. మీ పిల్లలు కూడా అథ్లెటిక్స్ లో రాణించాలని మీరు కోరుకుంటే, మీరు వారి ఆహారంపై చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అథ్లెటిక్స్‌లో పాల్గొనే వారి ఆహారంలో ఏ పోషకాలు చాలా అవసరమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.  

25

కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం చాలా ముఖ్యం

మీ పిల్లలు అథ్లెట్ గా రాణించాలన్నా, లేదా స్పోర్ట్స్ లో పాల్గొనాలన్నా, వారి శరీరానికి కార్బోహైడ్రేట్లు తప్పనిసరిగా అందాలి. ఎనర్జీ జనరేట్ అవ్వాలంటే కార్బోహైడ్రేట్లే ప్రధాన వనరు. ఈ కార్బోహైడ్రేట్లు అధికంగా తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలలో ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. అందువల్ల వీటిని ఎక్కువ పెడితే పిల్లల శరీరానికి అవసరమైన శక్తి, ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. 

35

ప్రతి రోజూ ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి

పిల్లలు ఎదిగే కొద్దీ వారి శరీరంలో కండరాలు తయారవుతాయి. ఇప్పటికే ఉన్నవి స్ట్రాంగ్ అవుతాయి. మీ పిల్లలు అథ్లెట్ గా రాణించాలంటే వారి ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మాంసాహారం తినే పిల్లలైతే వారికి మాంసం, చేపలు, గుడ్లు పెట్టడం మంచిది. శాఖాహారులైతే పిల్లలకు ప్రతిరోజూ పప్పులు, చిక్కుళ్ళు తినిపించడం మంచిది.

45

ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలతో శరీరానికి శక్తి

సాధారణంగా డైట్ చేసేవారు కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటారు. కానీ అథ్లెటిక్స్‌లో పాల్గొనే వారికి కొవ్వులు చాలా అవసరం. కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల శక్తి లభిస్తుంది. దీని కోసం మంచి కొవ్వులను ప్రొడ్యూస్ చేసే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవచ్చు. వాల్‌నట్స్, ఆలివ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ మొదలైనవి మంచి కొవ్వులను అందిస్తాయి. ఇవి శరీరానికి హాని కూడా చేయవు. 

55

హైడ్రేటెడ్ గా ఉండేలా శ్రద్ధ పెట్టాలి

అథ్లెటిక్స్ లో రాణించాలనుకొనే వారు ఎప్పటికప్పుడు హైడ్రేషన్ పై కూడా శ్రద్ధ పెట్టాలి. లేకుంటే శరీరంలో నీటి కొరత ఏర్పడి బలహీనంగా అనిపిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ఎక్కువ నీరు తాగాలి. అలాగే స్పోర్ట్స్ డ్రింక్స్ కూడా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories