నెయిల్ ఫంగస్ :
పిల్లల గోళ్లపై నెయిల్ పాలిష్ వాడటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి గోళ్ల సహజ రూపాన్ని మారుస్తుంది. రంగు మారడం, గోళ్లు విరగడం , గోరు ప్లేట్ సన్నబడటం వంటి వివిధ సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల, పిల్లల గోళ్లకు పాలిష్ వేయకుండా ఉండటం మంచిది.
గ్యాస్, జీర్ణ సమస్యలు:
మీరు మీ పిల్లల గోళ్లకు నెయిల్ పాలిష్ వేస్తూ ఉంటే, అది చాలా కాలం పాటు వాటికి అంటుకుంటుంది. దీని అర్థం పిల్లలు గోళ్లు కొరికినప్పుడు, పాలిష్‌లోని విషపూరిత రసాయనాలు వారి శరీరంలోకి నోటి ద్వారా ప్రవేశిస్తాయి. ఇది గ్యాస్, ఆరోగ్య సమస్యలు , జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.