ప్రతి పేరెంట్స్ తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం వారికి మంచి ఫుడ్ ఇస్తారు. కానీ పిల్లలు సరిగ్గా తినకపోతే.. అనారోగ్యానికి గురవుతుంటారు. బరువు కూడా పెరగరు. మరి వారికి ఎలాంటి ఫుడ్స్ పెడితే వయసుకు తగ్గ బరువు పెరుగుతారో ఇక్కడ చూద్దాం.
పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదగాలంటే సరైన పోషకాహారం అందించడం ముఖ్యం. ఆకలి లేకపోవడం, తక్కువ తినడం వంటివి పిల్లల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. మరి పిల్లలు వయసుకు తగ్గట్టుగా బరువు పెరగాలంటే ఎలాంటి ఆహారం ఇవ్వాలో ఇక్కడ చూద్దాం.
27
బంగాళదుంప (Potato)
పిల్లలు బంగాళదుంపను బాగా ఇష్టపడతారు. బంగాళదుంపలో కేలరీలు, అమైనో ఆమ్లాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల పిల్లలు త్వరగా బరువు పెరుగుతారు.
37
అరటిపండు (Banana)
అరటిపండు శరీరానికి కావాల్సిన పోషకాలను, శక్తిని ఇస్తుంది. ఒక అరటిపండులో దాదాపు 105 కేలరీలు ఉంటాయి. దీన్ని పిల్లలకి పచ్చిగా, మిల్క్ షేక్ లేదా జ్యూస్ రూపంలో ఇవ్వచ్చు.
గుడ్డులో ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పెరుగుతున్న పిల్లలకు ఇవి చాలా అవసరం. గుడ్డు.. పిల్లల బరువు పెంచడంలో సహాయపడుతుంది. ఉడికించిన గుడ్లు ఇవ్వడం మంచిది.
57
డ్రై ఫ్రూట్స్ (Dry Fruits)
డ్రై ఫ్రూట్స్, నట్స్.. పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరగడానికి సహాయపడతాయి. ఇవి మంచి పోషకాలు, చక్కెర, శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి, వయసుకు తగ్గట్టుగా బరువు పెరగడానికి డ్రై ఫ్రూట్స్ పెట్టచ్చు.
67
పాల ఉత్పత్తులు
పెరుగుతున్న పిల్లల ఆహారంలో పాలు, జున్ను, వెన్న వంటి పాల ఉత్పత్తులు కచ్చితంగా ఉండాలి. వీటిలోని కాల్షియం ఎముకలను బలపరుస్తుంది. వెన్న బరువు పెరగడానికి తోడ్పడుతుంది.
77
చికెన్ (Chicken)
చికెన్.. ప్రోటీన్, కేలరీలకు మంచి మూలం. ఇది కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది.
పీనట్ బటర్ (Peanut Butter)
పీనట్ బటర్.. పెరుగుతున్న పిల్లలకు చాలా మంచిది. ఇందులో ఆరోగ్యకరమైన కేలరీలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని కూరగాయలు లేదా పండ్లతో కలిపి తినచ్చు. కానీ ఎక్కువగా తినడం మంచిది కాదు.