Baby Powder Safety : పిల్లలకు పౌడర్ రాయడం సురక్షితమా? కాదా?

Published : Jul 06, 2025, 09:56 AM IST

Baby Powder Safety : చిన్నపిల్లలకు స్నానం చేయించిన తర్వాత చాలా మంది పౌడర్ రాస్తుంటారు. అయితే.. పిల్లలకు పౌడర్ పూయడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ పిల్లలకు పౌడర్ రాస్తే.. ఏమవుతుంది. వైద్యులు ఏమంటున్నారు. 

PREV
15
పిల్లలకి పౌడర్ రాయడం ప్రమాదమా?

పిల్లల సంరక్షణ అంత తేలిక కాదు. ముఖ్యంగా వాళ్ల చర్మ సంరక్షణ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.  ఎందుకంటే.. చర్మం ఎంతో మృదువుగా, సున్నితంగా ఉంటుంది. కాబట్టి అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ప్రతిసారి స్నానం తర్వాత బేబీ పౌడర్ పూయడం చాలామందికి అలవాటు. కానీ, పిల్లల చర్మ ఆరోగ్యానికి మంచిదేనా? పిల్లల చర్మానికి దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలేంటీ? వచ్చే  సమస్యలేంటీ? అనే విషయం తెలుసుకుందాం. 

25
పిల్లలకి బేబీ పౌడర్ అవసరమా?

సాధారణంగా పుట్టిన పిల్లల శరీరం నుండి వచ్చే సహజ పాల వాసన ప్రత్యేకమైనదిగా ఉంటుంది. అందుకే చాలామంది, పిల్లలకు స్నానం చేయించిన తరువాత ఆ వాసన రాకుండా బేబీ పౌడర్ ఉపయోగిస్తారు. అయితే బేబీ పౌడర్‌లలో మెగ్నీషియం, సిలికాన్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి చర్మంలోని తేమను పీల్చుకుని పొడిబారేలా చేస్తాయి. పిల్లల చర్మం చాలా సున్నితమైనది. కాబట్టి, ఎంత ఖరీదైన పౌడర్ అయినా వాడకపోవడమే మంచిది. సహజ శుభ్రత, తేమను కాపాడే విధానాలవైపు మొగ్గు చూపటం ఉత్తమం.

35
దుష్ప్రభావాలు

బేబీ పౌడర్ వాడటం వల్ల పిల్లల సున్నితమైన చర్మానికి తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగవచ్చు. పౌడర్ లోని కణాలు చర్మ రంధ్రాలను మూసివేసి, చిన్న చిన్న పొక్కులు, మొటిమలు ఏర్పడేలా చేస్తాయి. కొన్నిసార్లు చర్మ అలెర్జీలు కూడా రావచ్చు. అందుకే చాలామంది పిల్లల వైద్యులు బేబీ పౌడర్ వాడకూడదని సూచిస్తున్నారు. పిల్లల చర్మాన్ని సహజంగా శుభ్రంగా, తేమతో ఉంచే విధానాలు అనుసరించటం ఉత్తమం.

45
ఈ తప్పులు చేయకండి

సాధారణంగా డైపర్ వల్ల వచ్చే పుండ్లకు బేబీ పౌడర్ వాడటం సాధారణంగా కనిపించే అలవాటు. కానీ, ఇది సరైన పద్ధతి కాదు. పౌడర్ వల్ల చర్మం పొడిబారి, మరింత అసౌకర్యం మారవచ్చు. డైపర్ పుండ్లు రాకుండా ఉండాలంటే, పిల్లలు మలవిసర్జన చేసిన వెంటనే శుభ్రంగా నీటితో కడిగి, సున్నితమైన తువ్వాలతో నెమ్మదిగా తుడవాలి. అనంతరం చర్మం పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే డైపర్ వేసేలా చూడాలి. ఇలా చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, ఇన్‌ఫెక్షన్‌ల అవకాశాలు తగ్గుతాయి.

55
గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు:

వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి: పిల్లలకు ఎలాంటి చర్మ సమస్య వచ్చిన ఇంటివైద్యాలకే పరిమితమవకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఆలస్యం చేస్తే ప్రమాదంగా మారవచ్చు. 

టాల్క్ లేని పౌడర్ వాడవచ్చు: సాధారణ బేబీ పౌడర్ బదులుగా టాల్క్-ఫ్రీ పౌడర్ వాడొచ్చు. అయినప్పటికీ, దాన్ని కూడా మితంగా మాత్రమే ఉపయోగించాలి.

సహజ ఆయిల్స్ : డైపర్ వల్ల వచ్చే దద్దుర్లు, పొడి చర్మానికి నివారణగా ఆలివ్ ఆయిల్ లేదా శుద్ధి చేసిన కొబ్బరి నూనెను వాడొచ్చు. ఇవి చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతాయి.

శుభ్రతకు ప్రాధాన్యత : పిల్లల్ని తరచూ శుభ్రంగా ఉంచాలి. డైపర్ మార్చిన ప్రతిసారీ శుభ్రంగా కడిగి, సున్నితంగా తుడిచిన తర్వాత చర్మం పూర్తిగా ఆరినపుడే కొత్త డైపర్ వేయాలి.

Read more Photos on
click me!

Recommended Stories