పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ వారు ఇష్టంగా అడుగుతున్నారని మనం పెట్టే కొన్ని బయటి ఫుడ్స్ వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. నిపుణుల ప్రకారం పిల్లలకు పొరపాటున కూడా పెట్టకూడని కొన్ని ఆహారాలున్నాయి. అవేంటో చూద్దాం.
చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు పిల్లలకు చాలా ప్రమాదకరం. చాక్లెట్లు, కేకులు, ఐస్‌క్రీములు పిల్లలకి ఎంత ఇష్టమో అంత హానికరం కూడా. వీటిలో ఉన్న అధిక చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచి తాత్కాలికంగా ఉత్సాహాన్ని ఇస్తుంది. కానీ తర్వాత అలసట, చిరాకు, ఆగ్రహం కలిగిస్తుంది. అంతేకాకుండా దంత సమస్యలు, బరువు పెరగడం, భవిష్యత్తులో డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి చాక్లెట్లు లేదా స్వీట్లను పిల్లలకు ఎంత తక్కువ ఇస్తే అంత మంచిది.
26
ప్యాకెట్ స్నాక్స్
ప్యాకెట్ స్నాక్స్ కూడా పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. చిప్స్, కుర్కురే, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి పదార్థాలలో ట్రాన్స్ ఫ్యాట్, సోడియం, ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. జీర్ణక్రియను నెమ్మది చేస్తాయి. చిప్స్‌లో ఉన్న అధిక ఉప్పు , ఆయిల్ కారణంగా రక్తపోటు, చర్మ సమస్యలు రావచ్చు. అధిక రుచి మనసుని తృప్తి పరిచినా శరీరాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఈ రకమైన ఫుడ్‌ను పిల్లలకు పెట్టకపోవడమే మంచిది.
36
సాఫ్ట్ డ్రింక్స్
పిల్లల పుట్టిన రోజులు, పార్టీల్లో సాఫ్ట్ డ్రింక్స్ ని తరచుగా ఇస్తుంటారు. కానీ వీటిలో కెఫిన్, ఫాస్ఫారిక్ యాసిడ్, అధిక చక్కెర ఉంటాయి. ఇవి ఎముకల్లో కాల్షియాన్ని తగ్గిస్తాయి. దంత సమస్యలను కలిగిస్తాయి. అంతేకాదు రోగనిరోధక శక్తి తగ్గడానికి కారణం అవుతాయి. కొన్ని డ్రింక్స్ లో వాడే రంగులు పిల్లల్లో అలెర్జీలు లేదా హైపర్‌యాక్టివిటీని పెంచుతాయి. కాబట్టి పిల్లలకు నీళ్లు, తాజా పండ్ల రసాలు లేదా ఇంట్లో తయారుచేసిన బట్టర్‌మిల్క్ వంటివి ఇవ్వడం ఉత్తమం.
ఇన్‌స్టంట్ నూడిల్స్, ప్రాసెస్డ్ ఫుడ్‌లో మోనోసోడియం గ్లుటమేట్, సోడియం, ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల మెదడు, ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. వీటిని తరచుగా తినడం వల్ల పిల్లల్లో అలసట, జీర్ణ సమస్యలు వస్తాయి. వీటికి బదులు వెజిటెబుల్ ఉప్మా, సేమియా ఉప్మా, లేదా సూప్ వంటి ఇంటి వంటకాలు ఉత్తమం.
56
ఫాస్ట్ ఫుడ్
పిజ్జా, బర్గర్, పాస్తా లాంటి ఆహారాలను పిల్లలు ఇష్టపడతారు. కానీ వాటిలో ఉండే మైదా, చీజ్, సాసెస్, ఓవర్ ఫ్రైడ్ ఆయిల్ వల్ల శరీరంలో కొవ్వు పెరిగి రక్తనాళాలకు నష్టం కలుగుతుంది. తరచుగా తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. విటమిన్ లోపం వస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటమే మంచిది.
66
ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు
అధిక ఉప్పు ఉన్న ఆహారాలు కూడా పిల్లల ఆరోగ్యానికి హానికరమైనవి. పికిల్స్, పాప్‌కార్న్, చిప్స్ వంటివి తినడం వల్ల రక్తపోటు, డీహైడ్రేషన్, చర్మ సమస్యలు రావచ్చు. అలాగే సరిగ్గా ఉడకని గుడ్లు, పాశ్చరైజ్ కాని పాలు ఇవ్వకూడదు. వీటిలో సాల్మోనెల్లా అనే బాక్టీరియా ఉండే అవకాశం ఉంది. ఇది ఫుడ్ పాయిజన్ కు దారితీస్తుంది. కాబట్టి పిల్లలకు ఎప్పుడు కాచి చల్లార్చిన పాలను, పూర్తిగా ఉడికించిన గుడ్లను మాత్రమే ఇవ్వాలి.