పిల్లల మనసు గెలవాలంటే అమ్మ ఎలా ఉండాలో తెలుసా?

Published : Oct 30, 2025, 03:54 PM IST

ప్రతి తల్లికి తన బిడ్డంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమను ఎలా చూపాలి? అతి ప్రేమతో వారిని అల్లరి పిల్లలుగా మార్చకూడదు. కఠినంగా వ్యవహరించి వారిని దూరం చేసుకోకూడదు. మరి అమ్మ ఎలా ఉంటే పిల్లల మనసు గెలుచుకుంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
అమ్మ ఎలా ఉంటే పిల్లల మనసు గెలవచ్చు?

అమ్మ.. కేవలం ఒక పదం మాత్రమే కాదు. ప్రేమ, ఓర్పు, కరుణ, సహనం, త్యాగం అన్నింటికి చిహ్నం. పిల్లలకు మొదటి గురువు, మొదటి స్నేహితురాలు, మొదటి ఆదర్శం అమ్మే. కానీ ప్రతి అమ్మ తన పిల్లలతో ఎలా ఉండాలో కచ్చితంగా తెలుసుకోవాలి. నేటి ఫాస్ట్ లైఫ్ స్టైల్, టెక్నాలజీ, ఒత్తిడి, ఉద్యోగ బాధ్యతల మధ్య పిల్లలతో సమయం గడపడం ప్రతీ తల్లికి ఒక సవాలుగా మారింది. అయినా కూడా ఒక అమ్మగా మన పాత్రను సరిగ్గా అర్థం చేసుకుంటే పిల్లల భవిష్యత్తు అద్భుతంగా మలచవచ్చు.

26
పిల్లలు ఏం చెప్తున్నారో వినాలి

అమ్మ చేయాల్సిన మొదటి పని పిల్లలు చెప్పే విషయాలు వినడం. చాలాసార్లు పిల్లలు చెప్పే విషయాలు మనకు పెద్దవిగా అనిపించకపోయినా.. వారికి అవే పెద్ద విషయాలు. చాలా ముఖ్యమైనవి కూడా. పిల్లలు ఏదైనా విషయం చెప్తే.. దాని వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. పిల్లల మాట వినడమే వారి మనసును గెలుచుకునే మొదటి మెట్టు. ఒకసారి వారికి తల్లి మీద నమ్మకం కలిగితే.. ప్రతీ విషయాన్ని అమ్మతో పంచుకుంటారు. 

36
పిల్లలతో స్నేహంగా ఉండాలి.

అమ్మగా నియంత్రణ ఉండాలి. కానీ పూర్తిగా కఠినంగా ఉండటం కూడా మంచిదికాదు. కొన్నిసార్లు పిల్లలతో కలిసి నవ్వడం, ఆటలు ఆడటం, వారికి ఇష్టమైన విషయాలపై మాట్లాడటం వంటివి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. స్నేహితురాలిగా ఉన్న అమ్మకు పిల్లలు భయపడరు. ప్రేమిస్తారు. అలాగే పిల్లలు ఏ చిన్న విజయం సాధించినా వారిని ప్రోత్సహించాలి. “బాగుంది. నువ్వు చక్కగా చేశావు” అనే ఒక్క మాట వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. నిరంతరం తప్పులను చూపించడం కన్నా.. సరిగ్గా చేసినప్పుడు ప్రశంసించడం వల్ల వారిపై మంచి ప్రభావం పడుతుంది.

46
ఆదర్శంగా ఉండాలి

పిల్లలు వినడం కంటే చూసి ఎక్కువగా నేర్చుకుంటారు. మనం కోపంగా మాట్లాడితే వారు కూడా అలాగే ప్రవర్తిస్తారు. మనం ఓర్పుతో వ్యవహరిస్తే వారు కూడా సహనాన్ని నేర్చుకుంటారు. కాబట్టి తల్లి ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నించాలి. మాటల్లో కాదు, ప్రవర్తనతోనే వారికి పాఠం చెప్పాలి. అలాగే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం అవసరమే కానీ, వారిపై అనవసర ఒత్తిడి పెట్టకూడదు. వారిని ప్రతిభను గుర్తించి, సరైన దిశలో ప్రోత్సహించాలి. 

56
అతి ప్రేమ వద్దు

పిల్లలపై అతి ప్రేమ చూపడం, ఎలాంటి నియమాలు పెట్టకుండా వదిలేయడం కూడా ప్రమాదకరం. ప్రేమతో కూడిన క్రమశిక్షణే వారికి జీవితంలో విలువలను నేర్పుతుంది. “ఇది తప్పు, ఇది కరెక్టు” అని చెప్పేటప్పుడు కోపంతో కాకుండా.. కారణంతో చెప్పాలి. అప్పుడు వారికి ఈజీగా అర్థమవుతుంది. ఎదురు మాట్లాడే అవకాశం ఉండదు. 

66
క్వాలిటీ టైం

ప్రస్తుత కాలంలో చాలామంది అమ్మలు మొబైల్, టీవీ, సోషల్ మీడియా వంటి వాటిలో మునిగిపోతున్నారు. కానీ పిల్లల ఎదుగుదల సమయంలో వారికి ఇవ్వాల్సింది ఫుడ్ మాత్రమే కాదు. క్వాలిటీ టైం కూడా. రోజుకు కొన్ని నిమిషాలు పిల్లలతో కూర్చొని మాట్లాడటం, వారి రోజు ఎలా గడిచిందో అడగడం, కలిసి భోజనం చేయడం వంటివి వారికి తల్లిమీద ప్రేమ, గౌరవం పెరిగేలా చేస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories