చాలామంది పిల్లలు ఎప్పుడు చూసినా డల్ గా కనిపిస్తుంటారు. మొబైల్ లేదా టీవీల ముందు గంటల కొద్దీ కూర్చోవడం వల్ల పిల్లల చురుకుదనం అంతా మాయమవుతోంది. మరి పేరెంట్స్ ఏం చేస్తే పిల్లలు చురుకుగా ఉంటారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ప్రస్తుతం పిల్లల జీవితం బొమ్మలు, పుస్తకాలు, స్క్రీన్‌లతో నిండిపోయింది. బయట పరుగులు, ఆటలు, స్నేహితులతో నవ్వులు ఇవన్నీ క్రమంగా తగ్గిపోతున్నాయి. పైగా పిల్లలు ఎప్పుడు చూసినా అలసిపోయి కనిపిస్తున్నారు. నిజానికి పిల్లల్లో ఉత్సాహం లేకపోవడం వారి స్వభావం కాదు. అది మనం వారికి సృష్టించిన వాతావరణ ప్రభావం. పిల్లలు చురుగ్గా ఉండాలంటే వారిలోని సహజ కుతూహలం, ఆడుకోవాలనే ఆతృతను మళ్లీ మేల్కొలపాలి. వారికి ఆలోచించడానికి, అనుభవించడానికి అవకాశం ఇవ్వాలి.
26
ఆడుకోవడాన్ని ప్రోత్సహించాలి
పిల్లలు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శరీరం మాత్రమే కాదు. మనసు కూడా మందగిస్తుంది. ప్రతిరోజు కనీసం ఒక గంటపాటు బయటి వాతావరణంలో ఆడుకోవడాన్ని ప్రోత్సహించాలి. క్రీడలు, నడక, సైకిల్ రైడ్ లేదా తోటపని వంటివి చేయడం వల్ల వారి శరీరానికి శక్తి, మనసుకు ఉత్సాహం వస్తుంది. ప్రతిరోజూ సాయంత్రం పార్క్‌కి తీసుకెళ్లడం వంటివి చేయడం ద్వారా పిల్లల్లో ఆసక్తి పెరుగుతుంది.
36
పోషకాహారం
పిల్లలు చురుగ్గా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారాన్ని ఇవ్వాలి. చిప్స్, బిస్కెట్లు, సాఫ్ట్‌డ్రింక్స్ వంటివి తాత్కాలికంగా ఉత్సాహాన్ని ఇస్తాయి. కానీ దీర్ఘకాలంలో అలసటను పెంచుతాయి. బదులుగా పండ్లు, కూరగాయలు, పప్పులు, గింజలు, పాలు వంటి సహజ ఆహారం ఇవ్వాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కచ్చితంగా తినిపించాలి. అది రోజు మొత్తం శక్తి స్థాయిని ప్రభావితం చేస్తుంది.
తగినంత నిద్రపోవడం కూడా చురుకుదనంలో భాగమే. 6 నుంచి 12 ఏళ్ల పిల్లలకు కనీసం 9 నుంచి 11 గంటల నిద్ర అవసరం. లేట్ నైట్ వరకు టీవీ చూడడం, మొబైల్ వాడటం వంటివి శరీరంలోని శక్తి చక్రాన్ని దెబ్బతీస్తాయి. పిల్లలు త్వరగా నిద్రపోతే.. ఉదయాన్నే ఉత్సాహంగా లేస్తారు.
56
స్క్రీన్ టైమ్‌పై నియంత్రణ
ఇప్పటి పిల్లల ప్రధాన శత్రువు మొబైల్ ఫోన్. గంటలకొద్దీ స్క్రీన్‌కి అతుక్కుపోవడం వల్ల వారి శారీరక కదలికలు తగ్గుతాయి. అందుకే రోజుకు గరిష్ఠంగా ఒక గంట మాత్రమే స్క్రీన్ టైమ్‌గా నిర్ణయించాలి. మిగతా సమయాన్ని పుస్తకాలు చదవడం, డ్రాయింగ్, లేదా గార్డెన్‌లో గడపడం వంటి చురుకైన పనులతో నింపాలి.
66
ఆసక్తి గుర్తించి..
ప్రతి పిల్లవాడు ప్రత్యేకంగా ఉంటాడు. ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. కొందరికి సంగీతం, కొందరికి పెయింటింగ్, మరికొందరికి పజిల్స్ పై ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని గుర్తించి ప్రోత్సహిస్తే.. పిల్లలో ఉత్సాహం, చురుకుదనం రెండూ పెరుగుతాయి. దాంతోపాటు పిల్లలు చేసే చిన్న పనులను కూడా ప్రోత్సహించాలి. తిట్టడం, వేరేవాళ్లతో పోల్చడం వంటివి వారిని మరింత వెనక్కి లాగుతాయి. అంతేకాదు పిల్లలు తల్లిదండ్రుల ప్రవర్తనను అనుకరిస్తుంటారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా చురుకుగా ఉండాలి. మార్నింగ్ వాక్, చిన్న చిన్న వ్యాయామాలు, ఇంటి పనుల్లో చురుకుదనం చూపిస్తే పిల్లలు కూడా అలాగే చురుకుగా ఉంటారు.