పిల్లలకు వాంతులు, విరేచనాలు అయినప్పుడు సరిగ్గా తినరు. నీరసంగా అయిపోతారు. వారిని చూసి పేరెంట్స్ కూడా టెన్షన్ పడతారు. పిల్లలకు ఏ ఫుడ్ పెట్టాలో తెలియక ఇబ్బంది పడతారు. మరి పిల్లల స్టమక్ అప్ సెట్ అయినప్పుడు ఏం పెట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.
పిల్లలకు వాంతులు, విరేచనాలు అయినప్పుడు పెట్టాల్సిన ఫుడ్స్
పిల్లలకు వాంతులు, విరేచనాలు అయినప్పుడు ఏ ఫుడ్ పెట్టాలో తెలియక చాలామంది పేరెంట్స్ సతమతమవుతుంటారు. నిజానికి అలాంటి టైంలో మంచి ఫుడ్ ఇస్తేనే పిల్లలు కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని ప్రత్యేక ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి. మరి పిల్లల స్టమక్ అప్ సెట్ అయినప్పుడు ఏం ఇవ్వాలి? ఏం ఇవ్వకూడదు? ఎందుకు ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
పిల్లలకు వాంతులు, విరేచనాలు వంటివి ఎక్కువగా వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్, ఫుడ్ పాయిజనింగ్, నీటి మార్పు, లేదా సున్నితమైన జీర్ణ వ్యవస్థ కారణంగా వస్తాయి. అయితే ఆ టైంలో డిహైడ్రేషన్ రాకుండా చూడటం, పిల్లల జీర్ణవ్యవస్థకు భారం లేకుండా తేలికైన ఆహారం ఇవ్వడం ముఖ్యం.
25
డ్రింక్స్ ఇవ్వడం
పిల్లలు వాంతులు చేసుకున్నప్పుడు ఎక్కువ ఆహారం, బలవంతంగా ఇవ్వకూడదు. తక్కువ తక్కువ మోతాదుల్లో ఆరోగ్యకరమైన డ్రింక్స్ ఇవ్వడం ముఖ్యం. ఎందుకంటే వాంతులు, విరేచనాల సమయంలో శరీరం నీరు, లవణాలను కోల్పోతుంది. కాబట్టి శరీరానికి అవసరమైన నీటిని, లవణాలను తిరిగి అందించడం అవసరం.
35
ఏ ఫుడ్స్ పెట్టొచ్చు?
డీహైడ్రేషన్ తగ్గిన తర్వాత సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని చిన్న మోతాదుల్లో ఇవ్వడం ప్రారంభించాలి. ముఖ్యంగా గంజి. ఇది కడుపును తేలికగా ఉంచుతుంది. శరీరానికి అవసరమైన ద్రవాలు, గ్లూకోజ్ అందిస్తుంది. ఇడ్లీ తేలికగా జీర్ణం అవుతుంది. పొంగల్ / కిచిడి.. శరీరానికి శక్తినిస్తుంది. తేలికగా జీర్ణమవుతుంది. పొటాషియం పుష్కలంగా ఉండే అరటి పండును వాంతుల తర్వాత తింటే శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ భర్తీ అవుతాయి. రసం కూడా కడుపుని తేలిక చేస్తుంది. సజ్జ జావ, రాగి జావ, ఓట్స్ వంటివి పిల్ల జీర్ణశక్తికి అనుగుణంగా పలుచగా చేసి ఇవ్వొచ్చు.
పిల్లలకు స్టమక్ అప్ సెట్ అయినప్పుడు ఏం పెట్టకూడదో తెలుసుకోవడం కూడా ముఖ్యం. ఫ్రూట్ జ్యూసులు, ముఖ్యంగా ఆపిల్, ద్రాక్ష, మామిడి జ్యూస్ వంటివి విరేచనాలను మరింత పెంచుతాయి. అలాగే పాల టీ, కారాలు, ఫ్రైలు, ఫాస్ట్ ఫుడ్, చిప్స్, చాక్లెట్‌లు, కూల్ డ్రింక్స్ ఇవ్వడం మంచిదికాదు. ఇవి కడుపులో ఆమ్లతను పెంచి వాంతులు మళ్లీ రావడానికి కారణమవుతాయి.
55
శుభ్రత ముఖ్యం
అలాగే ఇంట్లో శుభ్రత చాలా ముఖ్యం. పిల్లలు తాగే నీరు తప్పనిసరిగా కాచి చల్లార్చి ఇవ్వాలి. ప్లేట్‌లు, స్పూన్‌లు పరిశుభ్రంగా ఉంచాలి. విరేచనాల సమయంలో పిల్లలకు ఇచ్చే ఆహారం తాజాగా తయారు చేయాలి. నిల్వ ఆహారం ఇవ్వడం ప్రమాదకరం. ఒక రోజుకు మించి వాంతులు, విరేచనాలు కొనసాగితే డాక్టర్ని సంప్రదించడం మంచిది.