పేరెంట్స్ రోజూ పిల్లలకు ముద్దు పెట్టి, హగ్ ఇవ్వడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Published : Nov 22, 2025, 04:40 PM IST

తల్లిదండ్రులకు పిల్లలంటే అపారమైన ప్రేమ ఉంటుంది. ఎప్పుడూ వారిని ముద్దు చేస్తూనే ఉంటారు. అయితే పేరెంట్స్ ప్రేమగా పిల్లలకు రోజూ ఒక ముద్దు పెట్టడం, హగ్ ఇవ్వుడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.

PREV
15
Parenting Tips

తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించడమే కాదు.. ఆ ప్రేమను వ్యక్తపరచడం కూడా ముఖ్యం. రోజూ పిల్లలకు ఒక హగ్ ఇవ్వడం, ముద్దు పెట్టడం చిన్న విషయంలా కనిపించినా, పిల్లల మనసులో అది అపారమైన భద్రత, సాంత్వన, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. పేరెంట్స్ పిల్లలపై ప్రేమను మాటల్లో చెప్పడమే కాక, చేతల్లో కూడా చూపిస్తే.. అది పిల్లల మెదడు, హృదయాల్లోకి మరింత బలంగా చేరుతుంది. 

25
హగ్ ఇవ్వడం వల్ల కలిగే లాభాలు

రోజూ హగ్ ఇవ్వడం వల్ల పిల్లల మెదడులో “ఆక్సిటోసిన్” అనే హ్యాపీ హార్మోన్ విడుదల అవుతుంది. ఇది పిల్లలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. భయాన్ని తొలగిస్తుంది. కోపాన్ని నియంత్రిస్తుంది. మనుషుల మధ్య ప్రేమ, అనుబంధం పెంచడంలో ఈ హార్మోన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే హగ్ చేసుకున్న తర్వాత పిల్లలు వెంటనే స్మైల్ ఇస్తారు. ప్రశాంతంగా మారతారు. 

35
పిల్లలకు ముద్దు పెట్టడం వల్ల కలిగే లాభాలు

పిల్లలకు ముద్దు పెట్టినప్పుడు వారిలో ఒక ప్రత్యేకమైన భావం మేల్కొంటుందని నిపుణులు చెబుతున్నారు. ముద్దు పెట్టినప్పుడు వారి హార్ట్ బీట్ మారుతుంది. శ్వాస నెమ్మదిస్తుంది, మనసులో ప్రేమ పూరిత వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా స్కూలుకు వెళ్లే పిల్లలు ఉదయం ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఒక ముద్దు పెట్టి.. హగ్ ఇవ్వడం వల్ల రోజంతా వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. పేరెంట్స్ చూపించే ప్రేమ వారికి గుర్తుకు వస్తుంది. దానివల్ల ఒంటరితనం దూరమవుతుంది. స్కూల్‌లో ఏ పని అయినా ధైర్యంగా చేస్తారు.

45
పిల్లలు తప్పు చేసినా..

పిల్లలు తప్పులు చేసినప్పటికీ.. వారు బాధపడుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు హగ్ ఇవ్వడం వల్ల వారికి తెలియని శక్తి లభిస్తుంది. “నేను నీతోనే ఉన్నాను, భయపడాల్సిన అవసరం లేదు” అనే భావన వారిలో కలుగుతుంది. దానివల్ల పిల్లలు తప్పును ఒప్పుకోవడానికి, నేర్చుకోవడానికి, మళ్లీ ప్రయత్నించడానికి సిద్ధంగా ఉంటారు.  

55
బలమైన బంధం..

రోజూ ఇలా పేరెంట్స్ ప్రేమని పొందిన పిల్లలు భవిష్యత్తులో మంచి వ్యక్తులవుతారు. క్రమశిక్షణతో ఉంటారు. ఇతరులను అర్థం చేసుకునే గుణాన్ని కలిగి ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు రోజూ పిల్లలను ఇలా ప్రేమతో దగ్గర చేసుకోవడం తల్లిదండ్రులకూ మంచిదే. మనసులో ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది. రోజంతా పని చేసిన అలసట సడలిపోతుంది. మనసు తేలికవుతుంది. ఈ ప్రేమ వాతావరణం పిల్లలు, తల్లిదండ్రుల మధ్య బంధాన్నీ మరింత బలపరుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories