పిల్లలకు జ్ఞాపకశక్తి బాగుంటే చదువులో ముందుంటారు. జీవితంలో చక్కగా ఎదుగుతారు. జ్ఞాపకశక్తి పెరగడానికి వారికి అవసరమయ్యే కొన్ని చిట్కాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే పిల్లలు చిన్నప్పటి నుంచే చాలా చురుకుగా ఉండాలి. చదువుపై దృష్టి పెట్టాలి. జ్ఞాపకశక్తి బాగుంటేనే పిల్లలు అన్నింటిలో ముందుంటారు. మరి పిల్లలకు జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? కొన్ని మంచి అలవాట్లతో పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంపొందించవచ్చు. ఈ అలవాట్లు వారి జీవితంలో గొప్ప మార్పు తీసుకురావచ్చు.
24
మంచి నిద్ర:
మెదడు చక్కగా పనిచేయాలంటే విశ్రాంతి చాలా అవసరం. పిల్లలు రోజూ కనీసం 8 నుంచి 10 గంటలు గాఢంగా నిద్రపోవాలి. మంచి నిద్ర.. పగటిపూట నేర్చుకున్న పాఠాలను మెదడులో నిక్షిప్తం చేయడానికి, ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది. నిద్రలేమి వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఏకాగ్రత దెబ్బతింటుంది. చదివిన పాఠాలను గుర్తుంచుకోవడం చాలా కష్టమవుతుంది.
34
హెల్తీ బ్రేక్ ఫాస్ట్
ఉదయం తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైనది. ఇది మెదడుకి అవసరమైన గ్లూకోజ్, శక్తిని అందిస్తుంది. తృణధాన్యాలు, పండ్లు, పాలు వంటి పోషకమైన అల్పాహారం ఇవ్వడం ద్వారా పిల్లల కడుపు నిండుగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. తరగతి గదిలో చాలా చురుగ్గా ఉంటారు. పాఠాలను శ్రద్ధగా వింటారు. ఉదయం టిఫిన్ మానేయడం వల్ల అలసట పెరుగుతుంది. ఏకాగ్రత లోపిస్తుంది.
పాఠ్య పుస్తకాలతో పాటు, రోజుకు కనీసం 20 నిమిషాలు అయినా కథల పుస్తకాలు, వార్తాపత్రికలు లేదా వారికి నచ్చిన ఇతర పుస్తకాలను చదవడం అలవాటు చేయాలి. దానివల్ల వారికి పద సంపత్తి పెరుగుతుంది. వ్యాక్య నిర్మాణం తెలుస్తుంది. ఊహాశక్తి పెరుగుతుంది. పిల్లలకు చదవడం అలవాటు చేయడం వల్ల వారు సులభంగా పాఠాలను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.