మనలో చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే పెద్దవాళ్లు టీ తాగేటప్పుడు వారి చుట్టూ ఉండే పిల్లలు కూడా టీ ఇవ్వమని అడుగుతుంటారు. అసలు పిల్లలు టీ తాగడం మంచిదేనా? దానివల్ల వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.
ఫుడ్ లేకపోయినా మంచిదే కానీ.. టీ ఉంటే చాలని చాలామంది అనుకుంటారు. అయితే పెద్దవాళ్లు టీ తాగడం చూసి.. చాలామంది పిల్లలు వారికి కూడా టీ కావాలని అడుగుతుంటారు. అప్పుడు చాలామంది పేరెంట్స్ బిస్కెట్లతో పాటు టీ ఇస్తుంటారు. కానీ పిల్లలకి టీ ఇవ్వడం మంచిదేనా? అది వారి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
24
నిపుణుల ప్రకారం..
పిల్లలకి టీ ఇవ్వకూడదని నిపుణులు చెబుతున్నారు. 10-12 కిలోల బరువున్న చిన్న పిల్లలకి ఒక కప్పు టీ ఇస్తే.. అది తాగిన తర్వాత వాళ్లు ఆహారం తినరట. సాధారణంగా పిల్లలు టీతో పాటు బిస్కెట్లు తింటుంటారు. దానివల్ల వారు వేరే ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడరట. పిల్లలకి ఉదయం లేదా సాయంత్రం టీ ఇస్తే వారికి ఆకలి తగ్గడమే కాదు.. పప్పులు, పండ్లు, కూరగాయల లాంటివి తినడం మానేస్తారట.
34
పిల్లల బరువుపై ప్రభావం
దానివల్ల వారి శరీరానికి కావాల్సిన పోషకాలు లభించవు. పిల్లల బరువు కూడా తగ్గుతుంది. బరువు తగ్గడం వల్ల రక్తహీనత వస్తుంది. మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. అందుకే పిల్లలకి టీ అలవాటు చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
- పిల్లలకి టీ ఇస్తే వాళ్ల శరీరంలో నీటిశాతం తగ్గిపోతుంది. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. - కెఫీన్ తీసుకోవడం వల్ల పిల్లలకి నిద్ర సరిగ్గా పట్టదు. మీరు పిల్లలకి కొంచెం టీ లేదా కాఫీ ఇచ్చినా చాలాసార్లు వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది. - టీ వల్ల పిల్లలకి ఎలాంటి పోషకాలు అందవు. అందుకే పిల్లలకి టీ ఇవ్వకుండా పోషకాలున్న ఆహారం ఇవ్వాలి. - పెద్దవాళ్ళు టీకి బానిసలైనట్టే, పిల్లలు కూడా టీకి బానిసలవుతారు. టీ అలవాటు ఒకరకమైన మత్తు లాంటిది. అందుకే పిల్లలు టీకి బానిసలు కాకుండా చూసుకోవాలి.